గత కొంతకాలం నుంచి భారత జట్టుకు దూరమైన సీనియర్ బాట్స్మన్ శిఖర్ ధావన్ ఎట్టి పరిస్థితుల్లో వరల్డ్ కప్ జట్టులో చోటు దక్కించుకోవాలని కంకణం కట్టుకున్నాడు. ఈ క్రమంలోనే ఐపీఎల్ లో వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తన మునుపటి ఫామ్ లో నిరూపించుకోవాలని అనుకుంటున్నాడు. జట్టు లోకి రావాలనే కసి తనలో ఎంతలా ఉంది అన్న విషయాన్ని ఇక ఐపీఎల్లో ప్రతి మ్యాచ్ లో కూడా తన బ్యాటుతో నిరూపిస్తున్నాడు అన్న విషయం తెలిసిందే. ఇక ఇటీవల సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుతో జరిగిన మ్యాచ్ లో కూడా వీరోచితమైన ఇన్నింగ్స్ ఆడాడు. 66 బంతుల్లోనే 99 పరుగులు చేసి అదరగొట్టాడు అని చెప్పాలి.


 అయితే ఈ మ్యాచ్లో సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు విజయం సాధించినప్పటికీ అటు పంజాబ్ కెప్టెన్ శిఖర్ ధావన్ ఆడిన ఇన్నింగ్స్ మాత్రం సన్రైజర్స్ అభిమానుల గుండెల్లో నిలిచిపోయింది అని చెప్పాలి. ఇక ధావన్ ఇన్నింగ్స్ లో 12 ఫోర్లు, ఐదు సిక్సర్లు ఉండటం గమనార్హం. ఒకవైపు సహచరుల వికెట్లు టపా టపామని పడుతున్న కూడా తాను మాత్రం ఒంటరి పోరాటం చేస్తూ జట్టుకు గౌరవప్రదమైన స్కోరును అందించాడు అని చెప్పాలి. దీంతో ఒక్క పరుగు దూరంలో సెంచరీ మార్క్ కు దూరమైనప్పటికీ కెరియర్ లోనే బెస్ట్ ఇన్నింగ్స్ ఆడాడు.



 88 పరుగుల వద్ద పంజాబ్ జట్టు 9వ వికెట్ కోల్పోయాక ఆఖరి నెంబర్ బ్యాటర్ తో కలిసి పదో వికెట్ కు 55 పరుగుల భాగస్వామ్యాన్ని అజెయంగా జోడించి చరిత్ర సృష్టించాడు. ఇటీవల సన్రైజర్స్ పై చేసిన 99 పరుగులు ఇన్నింగ్స్ ద్వారా విరాట్ కోహ్లీ రికార్డును బద్దలు కొట్టేసాడు శిఖర్ ధావన్.  ఐపీఎల్ చరిత్రలో అత్యధిక 50 ప్లస్ స్కోర్ నమోదు చేసిన ప్లేయర్గా నిలిచాడు అని చెప్పాలి. మొన్నటి వరకు కోహ్లీతో సమానంగా 50 సార్లు 50 ప్లస్ స్కోర్ చేసిన ప్లేయర్గా శిఖర్ ధావన్ ఉండగా..  ఇక 99 పరుగులతో 51 సార్లు 50 ప్లస్ స్కోర్ సాధించిన ఆటగాడిగా మారిపోయాడు. ఈ లిస్టులో 60 సార్లు 50 ప్లస్ స్కోర్ లతో డేవిడ్ వార్నర్ తొలి స్థానంలో ఉన్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: