భారత క్రికెట్ లో ఎంత మంది స్టార్ ప్లేయర్లు వచ్చి పోయినప్పటికీ అటు భారత మాజీ ఆల్రౌండర్ యువరాజ్ సింగ్ కి మాత్రం ప్రత్యేకమైన క్రేజ్ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. టీమిండియా తరఫున దాదాపు దశాబ్ద కాలం పాటు ఎనలేని సేవలు అందించాడు యువరాజ్ సింగ్. ఎన్నో ప్రపంచ రికార్డులను కూడా కొల్లగొట్టాడు అన్న విషయం తెలిసిందే. యువరాజ్ సింగ్ సాధించిన రికార్డులలో ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు కొట్టిన రికార్డు మాత్రం అటు అభిమానులందరికీ ఎప్పటికీ ఫేవరెట్ గా ఉంటుంది. ఇక ఈ రికార్డును ఎప్పటికీ ప్రేక్షకులు మరిచిపోలేరు అని చెప్పాలి.



 ఒకానొక సమయంలో క్యాన్సర్ బారిన పడి ఇక పూర్తిగా క్రికెట్కు దూరం అయిపోయిన యువరాజ్ సింగ్.. ఎంతో ఆత్మస్థైర్యంతో క్యాన్సర్ అనే మహమ్మారిని జయించి.. మళ్లీ భారత జట్టులోకి వచ్చాడు. కానీ మునుపటి ఫామ్ ను కొనసాగించలేకపోవడంతో ఇక జట్టులో చోటు కోల్పోయాడు అని చెప్పాలి. ఇక ఆ తర్వాత అవకాశాలు రాకపోవడంతో ఇక తన అంతర్జాతీయ క్రికెట్ కెరీర్ కు రిటైర్మెంట్ ప్రకటించాడు. అయితే రిటైర్మెంట్ ప్రకటించి ఆటకు దూరంగా ఉన్నప్పటికీ అటు సోషల్ మీడియా ద్వారా అభిమానులకు ఎప్పుడు దగ్గరగానే ఉంటున్నాడు.



 ఇకపోతే భారత దిగ్గజ క్రికెటర్ యువరాజ్ సింగ్ తన చిన్ననాటి ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. కొన్ని ఆసక్తికర విషయాలను అభిమానులతో పంచుకున్నాడు. తనకు చిన్నప్పుడు రోలర్ స్కేటింగ్ అంటే ఎంతో ఇష్టం ఉండేది అంటూ తెలిపాడు. అండర్ 14 ఛాంపియన్షిప్ ని కూడా నేను రోలర్ స్కేటింగ్ లో గెలుచుకున్నాను అంటూ తెలిపాడు.  అయితే తాను దేశం కోసం క్రికెట్ ఆడాలి అన్నది తన తండ్రి యోగరాజ్ కోరిక అని తెలిపాడు. ఇక అప్పటి నుంచి తనను రోజు ట్రైనింగ్ కు తీసుకు వెళ్తూ.. క్రికెట్ మీద మక్కువ వచ్చేలా తన తండ్రి చేశాడు అని యువరాజ్ సింగ్ ఆసక్తికర విషయాన్ని చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: