సాధారణంగా క్రికెట్లో భాగమైన ప్రతి ప్లేయర్ కూడా బ్యాటింగ్ చేయాల్సి వచ్చినప్పుడు ఇక తమ చేతివాటం ఆధారంగానే ఎటువైపు నుంచి బ్యాటింగ్ చేయాలి అని ఎంచుకుంటూ ఉంటాడు. ఇక ప్రస్తుతం ప్రపంచ క్రికెటర్లు కొంతమంది రైట్ హ్యాండ్ బ్యాట్స్మెన్లుగా ఉంటే మరి కొంతమంది లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్లు ఉన్నారు. అయితే ఇలా ప్రతి ఆటగాడు కూడా మొదటి నుంచి ఏ వైపు నుంచి బ్యాటింగ్ చేస్తూ ఉంటాడో.. ఇక ఆ ప్రతి మ్యాచ్ లో కూడా అదే బ్యాటింగ్ శైలిని కొనసాగిస్తూ ఉంటాడు అని చెప్పాలి. కానీ కొంతమంది ప్లేయర్లు మాత్రమే కొన్ని కొన్ని సార్లు కుడివైపు నుంచి మరికొన్నిసార్లు ఎడమవైపు నుంచి బ్యాటింగ్ చేయడం చూస్తూ ఉంటాము .



 ఇక ఇప్పుడు ఇలాంటి లిస్టులో అటు ఆస్ట్రేలియా స్టార్ ప్లేయర్ అయిన డేవిడ్ వార్నల్ కూడా చేరిపోయాడు అని చెప్పాలి. సాధారణంగా ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ గా కొనసాగుతున్న డేవిడ్ వార్నర్ బ్యాటింగ్ శైలి ఏంటి అని అడిగితే అందరూ టక్కున చెప్పే సమాధానం ఎడమ చేతివాటం బ్యాట్స్మెన్ అని. అలాంటి వార్నర్ తొలిసారి తన బ్యాటింగ్ శైలిని మార్చుకుని చరిత్ర సృష్టించాడు. ఇటీవల ముంబై ఇండియన్స్ తో జరిగిన మ్యాచ్ లో భాగంగా ఎనిమిదో ఓవర్ రెండో బంతిని ఎదుర్కొనే క్రమంలో డేవిడ్ వార్నర్ లెఫ్ట్ హ్యాండ్ నుంచి రైట్ హ్యాండ్ కు స్విచ్ అయ్యాడు.



 మామూలుగా అయితే క్రికెట్ రూల్స్ ప్రకారం ఒక ఆటగాడు తన బ్యాటింగ్ శైలిని మార్చుకోవడం వీలుకాదు. ఒక మ్యాచ్లో బంతి పడ్డాక బ్యాటింగ్ స్విచ్ చేయడం మాత్రం చూస్తూ ఉంటాం. కానీ వార్నర్ అలా చేయలేదు. దీంతో వార్నర్ రూల్ బ్రేక్ చేశాడని కొంతమంది అనుకుంటున్నారు. వాస్తవానికి వార్నర్ ఆడింది ఫ్రీ హిట్. హృతిక్  ఎనిమిదో ఓవర్లో మూడో బంతి నోబాల్ అయ్యాక చివరికి ఢిల్లీ జట్టుకు ఫ్రీ హిట్ లభించింది. ఫ్రీ హిట్ ఎలా ఆడిన ఎవరికి అభ్యంతరం ఉండదు. అందుకే వార్నర్ ఇలా తన లెఫ్ట్ హ్యాండ్ ని కాస్త రైట్ హ్యాండ్ గా మార్చుకొని బ్యాటింగ్ చేశాడు. కానీ కేవలం ఒక్క పరుగు మాత్రమే వచ్చింది. కానీ డిఫరెంట్ గా ఆలోచించి చరిత్ర సృష్టించాడు అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: