ఐపీఎల్‌-2023లో భాగంగా గురువారం నాడు (ఏప్రిల్‌12) రాత్రి రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ పరాజయం పాలైంది. చివరి బంతి దాకా ఎంతో ఉత్కంఠగా జరిగిన ఈ మ్యాచ్‌లో ధోని టీం కేవలం 3 పరుగుల తేడాతో ఓటమి పాలవ్వడం జరిగింది.అందువల్ల ఈ సీజన్‌లో రెండో పరాజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. మొత్తం 176 పరుగుల లక్ష్య ఛేదనలో సీఎస్కే వరుసగా వికెట్లని కోల్పోవడం జరిగింది. అయితే కెప్టెన్‌ ఎంఎస్‌ ధోని ఆఖరి దాకా క్రీజులో ఉండడంతో మళ్లీ ఆశలు చిగురించాయి. అందుకు తగ్గట్టుగానే కేవలం 17 బంతుల్లోనే ఏకంగా 32 పరుగుల ధనాధాన్‌ ఇన్నింగ్స్‌ ధోని ఆడాడు. ధోని ఇన్నింగ్స్‌లో ఒక్క ఫోర్‌, 3 సిక్సర్లు ఉన్నాయి. అయితే చెన్నై విజయానికి ఆఖరి బంతికి 5 పరుగులు అవసరం అవ్వగా ధోని సింగిల్‌ మాత్రమే తీయడంతో సీఎస్కేకు ఇక పరాజయం తప్పలేదు. కాగా ఓటమి బాధలో ఉన్న చెన్నై సూపర్ కింగ్స్ కి ఇప్పుడు మరోసారి బిగ్‌ షాక్‌ తగిలేలా ఉంది. ఎందుకంటే కెప్టెన్‌ ఎంఎస్‌ ధోని మోకాలి గాయంతో బాధపడుతున్నాడని తెలుస్తోంది.


రాజస్థాన్‌ టీంతో మ్యాచ్‌ తరువాత ఆ జట్టు హెడ్‌ కోచ్‌ అయిన స్టీఫెన్‌ ఫ్లెమింగ్‌ ఈ విషయంపై మాట్లాడాడు.'ధోని ప్రస్తుతం మోకాలి గాయంతో చాలా బాధపడుతున్నాడు. అందుకే మైదానంలో పరుగులు తీసేందుకు కూడా ఆయన చాలా ఇబ్బంది పడుతున్నాడు. రెండు పరుగుల రావల్సిన సందర్భాల్లో కేవలం సింగిల్‌ మాత్రమే ఆయన తీయగలిగాడు. ప్రస్తుతం మా వైద్య బృందం ధోనీని ఎంతగానో పర్యవేక్షిస్తోంది. ఇక మా తర్వాతి మ్యాచ్‌కు ఇంకా నాలుగు రోజుల సమయం ఉంది. కాబట్టి అప్పటిలోగా ధోని ఖచ్చితంగా కోలుకోంటాడని ఆశిస్తున్నాము. అయితే ధోని ఫిట్‌నెస్‌కు ఎలాంటి వంక పెట్టడానికి లేదు. టోర్నీ ప్రారంభానికి ముందే జట్టుతో కలిసి ఆయన ప్రాక్టీస్‌ను మొదలెట్టాడు. ఆయనలో కొంచెం కూడా జోరు తగ్గలేదు. ధోని చాలా అద్భుతమైన ఆటగాడు' అని ఫ్లెమింగ్‌ చెప్పుకొచ్చాడు. అయితే ఇప్పుడు ధోని గాయంపై సీఎస్కే ఫ్యాన్స్‌ ఆందోళన చెందుతున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నారు. ఇక సీఎస్‌కే తమ తర్వాతి మ్యాచ్‌లో బెంగళూరు టీంతో తలపడనుంది. ఏప్రిల్‌ 17 వ తేదీన బెంగళూరు చిన్న స్వామి స్టేడియంలో ఈ మ్యాచ్‌ జరగనుంది.మరి ఈ మ్యాచ్ అయిన గెలుస్తుందో లేదో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: