ఐపీఎల్ పోరు అటు ప్రేక్షకులు ఊహించిన దాని కంటే ఎంతో రంజుగా మారిపోయింది అన్న విషయం తెలిసిందే . ఇక ప్రతి జట్టు కూడా అదిరిపోయే ప్రదర్శన చేస్తూ అసలు సిసలైన ఎంటర్టైన్మెంట్ పంచుతుంది. దీంతో ప్రతి మ్యాచ్ కూడా నువ్వా నేనా అన్నట్లుగా చివరి బంతి వరకు సాగుతూ ప్రేక్షకులు అందరికీ అసలు సిసలైన క్రికెట్ మజాను అందిస్తూ ఉంది అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఒక్క మ్యాచ్ కూడా మిస్ చేయకుండా చూసేందుకే అటు ప్రేక్షకులందరూ ప్రత్యేక ఆసక్తి కనబరుస్తున్నారు అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఎంతోమంది ఆటగాళ్లు మంచి ప్రదర్శనలు చేసి అరుదైన రికార్డులు కూడా ఖాతాలో వేసుకుంటున్నారు.



 ఈ క్రమంలోనే ఇటీవల పంజాబ్ కింగ్స్ జట్టు తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్న బ్యాట్స్మెన్ హార్ ప్రీత్ సింగ్ ఒక అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు అని చెప్పాలి. ఈ రికార్డు అరుదైనది మాత్రమే కాదు కాస్త విచిత్రమైనది కూడా. పంజాబీ కింగ్స్ తరఫున అతను జట్టులో ఉన్నప్పటికీ తుది జట్టులోకి మాత్రం రాలేదు  హర్ ప్రీత్ సింగ్ భాటియా. అయితే ఇటీవలే ఐపిఎల్ హిస్టరీలో ఎవరికీ సాధ్యం కానీ ఒక విచిత్రమైన రికార్డు అతని ఖాతాలో చేరింది అని చెప్పాలి. దీంతో ప్రస్తుతం ఇది కాస్త హాట్ టాపిక్ గా మారిపోయింది. 2012 మే 19వ తేదీన పూణే వారియర్స్ కు ఆడాడు హర్ ప్రీత్ సింగ్.


 ఇక ఇటీవల లక్నో, పంజాబ్ కింగ్స్ మధ్య జరిగిన మ్యాచ్లో మరోసారి ఐపీఎల్ లో రెండో మ్యాచ్ ఆడాడు అని చెప్పాలి. అయితే ఈ రెండు మ్యాచ్ల మధ్య పదేళ్ల 332 రోజుల గ్యాప్ వచ్చింది అని చెప్పాలి. అంతకుముందు ఈ రికార్డు మాథ్యూ  వేడ్ పేరిట ఉండేది.. మాథ్యూ వేడ్  రెండు మ్యాచ్లకు మధ్య గ్యాప్ ఏకంగా 10 ఏళ్ల 312 రోజులు కావడం గమనార్హం. ఇలా ఐపీఎల్ హిస్టరీలో ఎవరికీ సాధ్యం కానీ ఒక విచిత్రమైన అరుదైన రికార్డును సృష్టించాడు హర్ ప్రీత్ సింగ్. ఈ రికార్డు గురించి తెలిసి ప్రతి ఒక్కరు షాక్ అవుతున్నారు. బౌలింగ్లో బ్యాటింగ్లో రికార్డు సృష్టించడం గురించి విన్నాం. కానీ ఇలా మ్యాచుల మధ్య గ్యాప్ తో కూడా రికార్డు సృష్టించవచ్చు అని నువ్వే నిరూపించావు అంటూ ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు నెటిజెన్స్.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl