టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ మైదానంలో ఎంత దూకుడుగా ఉంటాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఏకంగా 100 రెడ్ బుల్స్ తాగినంత ఎనర్జీ విరాట్ కోహ్లీలో కనిపిస్తూ ఉంటుంది. ఈ ఎనర్జీనే అటు ప్రత్యర్ధులను భయపెడుతూ ఉంటుంది అని చెప్పాలి. అయితే ఎప్పుడు ఎంతో అలర్ట్ గా ఉంటూ ఫీల్డింగ్లో విన్యాసాలు చేస్తూ ఉంటాడు. ఇక కోహ్లీ దగ్గరికి క్యాచ్ వెళ్లిందంటే చాలు అది అస్సలు మిస్ అవ్వదు అని అందరూ నమ్ముతూ ఉంటారు అని చెప్పాలి. ఇక ప్రపంచ క్రికెట్లో ఉన్న మేటి ఫీల్డర్లలో విరాట్ కోహ్లీ పేరే ముందు వరుసలో వినిపిస్తూ ఉంటుంది.



 అయితే విరాట్ కోహ్లీ తన దగ్గరికి వచ్చిన క్యాచులను వదిలేయడం చాలా అరుదుగా చూస్తూ ఉంటాం.  ఇక ఇటీవల పంజాబ్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్లో ఇలాంటిదే చేసాడు కోహ్లీ. ఎప్పుడు క్యాచ్లు పట్టడం విషయంలో ఎంతో క్లారిటీతో ఉండే విరాట్ కోహ్లీ.. మొదటిసారి ఒక క్యాచ్ విషయంలో కన్ఫ్యూజన్ కి గురయ్యాడు. వివరాల్లోకి వెళ్తే పంజాబ్ ఇన్నింగ్స్ 17వ ఓవర్లో జితేష్ శర్మ భారీ షాట్  ఆడాడు. ఈ క్రమంలోనే డీప్ మీడ్ వికెట్ లో ఫీల్డింగ్ చేస్తున్న సుయాష్ ప్రభు దేశాయ్ క్యాచ్ తీసుకోవడానికి పరుగులు పెట్టాడు. అదే సమయంలో లాంగ్ ఆన్లో ఫీల్డింగ్ చేస్తున్న కోహ్లీ కూడా పరుగు అందుకున్నాడు.



 అయితే క్యాచ్ పట్టడానికి మరోవైపు నుంచి దూసుకు వస్తున్న సూయాష్ ను గమనించిన కోహ్లీ నువ్వు ఆగు నేను అందుకుంటాను అని సైక చేసాడు. కోహ్లీ సైగను అర్థం చేసుకున్న సూయాష్ అగిపోయి క్యాచ్ పట్టడాన్ని విరమించుకున్నాడు. కానీ నేను అందుకుంటాను ధీమాగా చెప్పిన కోహ్లీ మాత్రంక్యాచ్ పట్టడంలో విఫలమయ్యాడు. చేతిలో పడినట్లే పడిన బంతి పట్టు తప్పి జారి కింద పడిపోయింది. క్యాచ్ మిస్ అయిన తర్వాత సుయాష్ నిరాశగా చూడగా కోహ్లీ నవ్వుతూ మిస్ అయింది అని చెప్పడం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: