టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీకి ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే మిగతా క్రికెటర్లతో పోల్చి చూస్తే ధోనీకి ప్రత్యేకమైన గుర్తింపు రావడానికి కారణం అతని ప్రశాంతతే అని చెప్పాలి. సాధారణంగా ఒత్తిడి సమయంలో మనిషి అన్నవాడు ఎవరైనా సరే చిరాకు, కోపంతో ఊగిపోతూ ఉంటాడు. కానీ మహేంద్రసింగ్ ధోనిని మాత్రం దేవుడు ప్రత్యేకంగా తయారు చేశాడేమో అన్నట్లుగా ఇక ఒత్తిడి సమయంలో చిరునవ్వుతోనే ప్రత్యర్ధులను భయపెడుతూ ఉంటాడు.


 ఎక్కడ ఒత్తిడికి గురికాకుండా ఎంతో ప్రశాంతంగా ఆలోచిస్తూ తన వ్యూహాలతో మ్యాచ్ స్వరూపాన్ని మొత్తం తన వైపుకు తిప్పుకుంటూ ఉంటాడు మహేంద్ర సింగ్ ధోని. అందుకే అభిమానులు అందరూ కూడా ధోనీనే మినిస్టర్ కూల్ అనే ప్రేమగా పిలుచుకుంటూ ఉంటారు. అయితే ఇలా ఎప్పుడూ ఎంతో ప్రశాంతంగా కనిపించే ధోనిలో కూడా  కట్టలు తెంచుకునే  ఆగ్రహాన్ని చూశాను అంటూ చెబుతున్నాడు ఇండియా మాజీ క్రికెటర్, ఐపీఎల్లో ధోని సహచరుడు అయిన హర్భజన్ సింగ్. అది కూడా ఒక్కసారి కాదు రెండుసార్లు ఇలా ధోని కోపాన్ని చూశాను అంటూ చెప్పుకొచ్చాడు.


 ఒక క్రీడా ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఓసారి రాజస్థాన్ తో మ్యాచ్ జరుగుతున్న సమయంలో ధోని ఆగ్రహాన్ని చూశాను. బెన్ స్టోక్స్ బౌలింగ్లో జడేజా సిక్స్ కొట్టాడు. ఆ తర్వాత అదే ఓవర్లో నోబాల్ వచ్చింది. అదే ఓవర్ లో బెంజ్ స్టోక్స్ మరో బౌన్సర్ వేశాడు. దాన్ని లెగ్ అంపైర్ నోబాల్ గా ఇచ్చాడు. కానీ నాన్ స్ట్రైకర్ ఎంపైర్ మాత్రం దానిని కాన్సల్ చేశాడు. అప్పటికే బ్యాట్స్మెన్లు రెండు పరుగులు తీశారు. మరో పరుగు కూడా రావాల్సి ఉంది. కానీ ప్రధాన ఎంపైర్ నోబెల్ క్యాన్సిల్ చేయడంతో ధోని కోపంతో మైదానం లోకి వెళ్లి ఎంపైర్లతో చర్చించాడు. అప్పుడు తెలిసింది ధోని కి కూడా కోపం వస్తుందని.. అది తీవ్రంగా ఉంటుందని.. ఇక అంతకుముందు ఝార్ఖండ్ లో ఒకసారి వార్మప్ మ్యాచ్  లో టీమ్స్ ని పంచుకొని ఆడుతుండగా.. ధోని టీం వెనుకబడింది. దీంతో కోపంతో ఊగిపోయిన ధోని బ్యాట్ నేలకేసి కొడితే హ్యాండిల్ విరిగిపోయింది అంటూ హర్భజన్ గుర్తు చేసుకున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: