ఈ ఏడాది ఐపీఎల్ సీజన్లో ఎప్పటిలాగానే ఎంతోమంది యువ బౌలర్లు అదిరిపోయే ప్రదర్శన చేస్తూ ఆకట్టుకుంటున్నారు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ప్రతి మ్యాచ్ లో కూడా వికెట్లు పడగొడుతూ.. అరుదైన రికార్డులు కూడా సృష్టిస్తూ ఉండడం చూస్తూ ఉన్నాం. అయితే యువ బౌలర్లకు తాము ఎక్కడ తక్కువ కాదు అన్నట్లు.. కెరియర్ ముగిసిపోయింది అనుకుంటున్న సీనియర్ ప్లేయర్లు కూడా అద్భుతమైన ప్రదర్శన చేస్తూ ఉన్నారు. ఇలా ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు తరపున ఇటీవల మళ్ళీ ఐపీఎల్ రీ ఎంట్రీ ఇచ్చిన భారత సీనియర్ బౌలర్ ఇషాంత్ శర్మ అదరగొడుతున్నాడు అని చెప్పాలి.



 ఢిల్లీ జట్టులోని మిగతా ఆటగాళ్ల ప్రదర్శన ఎలా ఉన్నప్పటికీ ఇషాంత్ శర్మ మాత్రం మంచి ప్రదర్శన చేస్తూ తన పని తాను చేసుకుంటూ పోతూ ఉన్నాడు. కీలక సమయంలో వికెట్లు పడగొట్టి ఇక జట్టును విజయాన్ని అందించేందుకు శాయశక్తుల కృషి చేస్తూ ఉన్నాడు అని చెప్పాలి. అయితే ఇప్పుడు వరకు ఇషాంత్ శర్మ తన బౌలింగ్ లో ఒక్క సిక్సర్ కూడా ఇవ్వలేదు అంటే ఎంత కట్టుదిట్టంగా బౌలింగ్ చేస్తున్నాడో అర్థం చేసుకోవచ్చు. సాధారణంగానే టీ20 ఫార్మాట్ అంటే బ్యాట్స్మెన్ లదే హవా నడుస్తూ ఉంటుంది. అలాంటి ఫార్మాట్లో ఒక్క సిక్సర్ కూడా ఇవ్వకుండా బౌలింగ్ చేయడం అంటే అది అసాధ్యమని చెప్పాలి.



 కానీ అలాంటి అసాధ్యాన్ని సుసాధ్యం చేసి చూపించాడు ఇశాంత్ శర్మ. ఈ సీజన్లో 84 బంతులు వేసిన ఇషాంత్ శర్మ కేవలం 91 పరుగులు మాత్రమే ఇచ్చాడు. 6.50 ఎకానమీతో ఆరు వికెట్లు తీసాడు. ఇక ఇప్పటివరకు ఒక్క సిక్సర్ కూడా ఇవ్వలేదు అంటే అతను ఎంత కట్టుదిట్టంగా బౌలింగ్ చేస్తున్నాడు అన్నది అర్థం చేసుకోవచ్చు. అయితే ఈ సీజన్లో 10 ఓవర్లకు పైగా బౌలింగ్ చేసి ఒక్క సిక్స్ కూడా ఇవ్వని ఏకైక బౌలర్గా ఇషాంత్ శర్మ అరదైన రికార్డును సృష్టించాడు అని చెప్పాలి. ఇక ఇటీవల గుజరాత్ టైటాన్స్ తో జరిగిన మ్యాచ్లో చివరి ఓవర్లో కేవలం 12 పరుగులు మాత్రమే ఇచ్చి జట్టుకు విజయాన్ని అందించాడు ఇశాంత్ శర్మ.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl