టీమిండియా సీనియర్ ఓపెనర్ శిఖర్ ధావన్ గత కొంతకాలం నుంచి టీమ్ ఇండియాలో పెద్దగా అవకాశాలు దక్కించుకోవడం లేదు. మొన్నటి వరకు కేవలం వన్డే ఫార్మాట్కు మాత్రమే పరిమితం అయ్యాడు. అయితే ఇప్పుడు వన్డే ఫార్మాట్లో శుభమన్ గిల్ లాంటి యంగ్ ఓపెనర్ విధ్వంసం సృష్టిస్తున్న నేపథ్యంలో.. అప్పటికే ఫామ్ కోల్పోయి ఇబ్బంది పడుతున్న శిఖర్ ధావన్ ను సెలెక్టరు పూర్తిగా పక్కన పెట్టేశారు. దీంతో ఇక ఈ ఏడాది జరగబోయే వన్డే వరల్డ్ కప్ లో అసలు ధావన్ ఉంటాడా లేదా అన్నది కూడా ఆసక్తికరంగా మారిపోయింది అని చెప్పాలి.



 అయితే టీమిండియా జట్టులో ఎట్టి పరిస్థితుల్లో ఛాన్స్ దక్కించుకోవాలని.. పట్టుదలతో ఉన్న ధావన్ కు ఐపీఎల్లో లక్కీ ఛాన్స్ వచ్చింది. ఒకవైపు జట్టును నడిపించేందుకు పంజాబ్ కింగ్స్ సారధ్య బాధ్యతలు కూడా తప్పించుకున్నాడు. ఇక మరోవైపు తన ఫామ్ నిరూపించుకునేందుకు ఛాన్స్ వచ్చింది. అయితే ఐపీఎల్ ప్రారంభం మొదట్లో వరుసగా మంచి ఇన్నింగ్స్ లు ఆడి అదరగొట్టిన శిఖర్ ధావన్.. అటు ఆ తర్వాత మాత్రం అదే జోరును కొనసాగించలేకపోయాడు. ఓపెనర్గా బలిలోకి దిగుతూ తక్కువ పరుగులు మాత్రమే చేసి వికెట్ కోల్పోతున్నాడు అని చెప్పాలి. ఇక ఇటీవల ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుతో జరిగిన మ్యాచ్ లోను పరుగుల ఖాతా తెరవకుండానే డక్ అవుట్ అయ్యాడు.



 అయితే ఇటీవల ఢిల్లీతో మ్యాచ్లో డక్ అవుట్ అవ్వడం కారణంగా పంజాబ్ కెప్టెన్ శిఖర్ ధావన్ చెత్త రికార్డును ఖాతాలో వేసుకున్నాడు. ఐపీఎల్ హిస్టరీలో ఓపెనర్ గా వచ్చి అత్యధిక సార్లు డకౌట్ అయిన రెండో బ్యాట్స్మెన్ గా నిలిచాడు శిఖర్ ధావన్. ఇటీవల ఢిల్లీ మ్యాచ్ తో పదిసార్లు సున్నాకే వెనుతిరిగాడు అని చెప్పాలి. అయితే ధావన్ కన్నా ముందు పార్థివ్  పటేల్ ఈ చెత్త రికార్డును మూటగట్టుకున్నాడు. పార్థివ్ పటేల్ ఓపెనర్ గా వచ్చి 11 సార్లు డక్ అవుట్ అయ్యాడు. అయితే గౌతమ్ గంభీర్ రహనేలు సైతం ఇలా పదిసార్లు డక్ అవుట్ అవ్వగా.. ఇక వీరి సరసన నిలిచి చెత్త రికార్డు మూటగట్టుకున్నాడు శిఖర్ ధావన్.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl