బిసిసిఐ ప్రస్తుతం వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ మ్యాచ్ కోసం సిద్ధమవుతుంది అన్న విషయం తెలిసిందే. ఈ ఏడాది బోర్డర్ గవస్కర్ ట్రోఫీలో విజయం సాధించడం ద్వారా.. ఇక వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ అర్హత సాధించింది టీమిండియా జట్టు. అయితే  డబ్ల్యూటిసి ఫైనల్ మ్యాచ్ ఇంగ్లాండ్ లోని లండన్ ఓవల్ వేదికగా జూన్ 7వ తేదీన జరగబోతుంది. ఆస్ట్రేలియా, భారత్ జట్లు డబ్ల్యూటీసి ఫైనల్లో భాగంగా పోటీ పడబోతున్నాయి అని చెప్పాలి. అయితే గత ఏడాది ఫైనల్ కు వెళ్లి రన్నరఫ్ తో సరిపెట్టుకున్న టీమిండియా.. ఈ ఏడాది మాత్రం తప్పనిసరిగా విశ్వవిజేతగా నిలవాలని ఆశపడుతుంది.


 ఈ క్రమంలోనే డబ్ల్యూటీసి ఫైనల్ కోసం అటు బీసీసీఐ కూడా ఎన్నో కసరత్తులు చేస్తూ ఉంది అని చెప్పాలి. అయితే ఇప్పటికే 15 మంది జట్టు సభ్యులతో కూడిన వివరాలను ప్రకటించింది బీసీసీఐ. కానీ ఐపీఎల్ కారణంగా అటు బీసీసీఐకి ఊహించని ఎదురు దెబ్బలు తగులుతున్నాయి అని చెప్పాలి. ఐపీఎల్ వల్ల కోట్ల ఆదాయం రావడం ఏమో కానీ విశ్వ విజేతగా నిలిచే ఛాన్సులు మాత్రం క్రమక్రమంగా సన్నగిల్లుతున్నాయి. ఎందుకంటే స్టార్ ప్లేయర్లుగా కొనసాగుతున్న వారు గాయం బారిన పడుతూ జట్టుకు దూరమవుతున్నారు.



 ఇప్పటికే యాక్సిడెంట్ వల్ల రిషబ్ పంత్, కాలి సర్జరీ వల్ల కె.ఎల్ రాహుల్.. వెన్ను నొప్పి గాయం కారణంగా బుమ్రా, శ్రేయస్ లాంటి కీలక ప్లేయర్లు దూరమయ్యారు. ఇక ఇప్పుడు డబ్ల్యూటీసీ ఫైనల్ కీ మరో బిగ్ షాక్ తగలబోతోందా అంటే అవుననే సమాధానమే అందరి నోటా వినిపిస్తుంది. భారత జట్టులో స్టార్ స్పిన్నర్ గా కీలక ప్లేయర్గా కొనసాగుతున్న అశ్విన్ వెన్ను నొప్పితో బాధపడుతున్నాడు. ఈ క్రమంలోనే ఇటీవలే పంజాబ్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ కు రాజస్థాన్ తరఫున బరిలోకి దిగాల్సిన అతను మ్యాచ్ ఆడలేదు. అతని ఆరోగ్య పరిస్థితిపై బీసీసీఐ క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. అయితే అశ్విన్ లాంటి తెలివైన స్పిన్నర్ భారత జట్టుకు దూరమయ్యాడు అంటే అది ఊహించని ఎదురు దెబ్బ అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: