ప్రస్తుతం అంతర్జాతీయ క్రికెట్లో టి20 వరల్డ్ కప్ కోసం కౌంట్ డౌన్  ప్రారంభమైంది అనే విషయం తెలిసిందే  ఈ క్రమంలోనే ఈసారి టి20 వరల్డ్ కప్ లో భాగంగా ఎవరు విజయం సాధించి విశ్వ విజేతగా నిలుస్తారు అన్న విషయం హాట్ టాపిక్ గా మారిపోయింది అని చెప్పాలి. ఇక ప్రస్తుతం అంతర్జాతీయ క్రికెట్ లో ఎక్కడ చుసిన ఇందుకు సంబంధించిన చర్చ జరుగుతూ ఉండడం గమనార్హం. ఇకపోతే టి20 వరల్డ్ కప్ లో ఏ జట్టు పటిష్టంగా ఉంది.. ఎవరు బాగా రాణిస్తారు అనే విషయంపై ఎంతో మంది మాజీ క్రికెటర్లు స్పందిస్తూ తమ అభిప్రాయాలను వ్యక్తం పరుస్తున్నారు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.


 ఇకపోతే ఇక ఇక ఎంతోమంది విదేశీ మాజీ క్రికెటర్లు సైతం స్పందిస్తూ ఈ ఏడాది ఆస్ట్రేలియా వేదికగా జరగబోయే టి20 వరల్డ్ కప్ లో తప్పకుండా భారత జట్టు టైటిల్ ఫేవరెట్ గా బరిలోకి దిగుతుంది అంటూ అభిప్రాయం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇదే విషయంపై  ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు చెన్నై సూపర్ కింగ్స్ మాజీ ప్లేయర్ షైన్ వాట్సన్ స్పందించాడు. ఒకవైపు వరల్డ్ కప్ కి ఆదిత్యం వహిస్తున్న ఆస్ట్రేలియా జట్టుతో పాటు ప్రస్తుతం ఎంతో పటిష్టంగా కనిపిస్తున్న భారత జట్టు కూడా టైటిల్ ఫేవరెట్ అంటూ చెప్పుకొచ్చాడు. ఇటీవల భారత్ ఆస్ట్రేలియా మధ్య జరిగిన టి20 సిరీస్ లో భారత జట్టు రెండు విజయాలతో సిరీస్ కైవసం చేసుకుంది  ఈ సిరీస్ లో భాగంగా భారత జట్టు ఆడిన విధానం చూస్తూ ఉంటే వరల్డ్ కప్ లో టైటిల్ ఫేవరెట్లలో ఒకటి కావడం ఖాయం అన్నది మాత్రం తెలుస్తుంది అంటూ అభిప్రాయం వ్యక్తం చేశాడు.  మరోవైపు అటు ఆస్ట్రేలియాకు కూడా స్వదేశీ పరిస్థితులు కచ్చితంగా కలిసి వస్తాయి. ఆస్ట్రేలియాన్లు స్వదేశంలోని మైదానాలను ఎంతో బాగా వినియోగించుకుంటారు అని భావిస్తున్నాను. ఈ రెండు జట్లలో ఎవరో ఒకరు వరల్డ్ కప్ టైటిల్ ఎగరేసుకుపోతారు అంటూ షేన్ వాట్సన్ చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: