ఇప్పటివరకు మనం మొబైల్ కు రీఛార్జ్ చేయించుకోవాలంటే దగ్గరలో ఉన్న రీఛార్జ్ సెంటర్ లకి వెళ్లడం లేదా దగ్గర్లో ఉన్న దుకాణాలకు వెళ్లి ఇటీవల కాలంలో మరింత టెక్నాలజీ పెరిగిపోవడం వల్ల మొబైల్ లోనే గూగుల్ పే , ఫోన్ పే , ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా కూడా మొబైల్ రీఛార్జ్ చేసుకోవడం చూస్తూనే ఉన్నాం. దిగ్గజ  టెలికాం సంస్ధ టెక్నాలజీ రంగంలో ఇప్పుడు మరొక అడుగు ముందుకు వేసింది. అది ఏమిటంటే,  సందేశాలను పంపే వాట్సప్ ద్వారా మొబైల్ రీఛార్జ్ చేసుకోవచ్చట. అది ఎలా చేయవచ్చో ఇప్పుడు ఇక్కడ చదివి తెలుసుకుందాం.

దిగ్గజ టెలికాం సంస్థ జియో రిలయన్స్ తమ కస్టమర్ల కోసం ఎప్పటికప్పుడు వినూత్న ఆలోచనలను చేస్తూ, వాటిని ఆచరణలో పెడుతున్న విషయం అందరికీ తెలిసిందే. ఇక అందులో భాగంగానే ఇప్పుడు కూడా ఒక సరికొత్త టెక్నాలజీతో కస్టమర్లకు సులభమైన మార్గాలను ఏర్పాటు చేసింది. అదేమిటంటే వాట్స్అప్ చాట్ బాట్  ఆప్షన్ ను ప్రవేశపెట్టింది. దీని ద్వారా మొబైల్ రీఛార్జ్ చేసుకోవచ్చు. అందేకాదు దీని ద్వారా  జియో సిమ్ ను కూడా  కొనుగోలు చేయవచ్చు. అలాగే జియో మార్ట్ , జియో  ఫైబర్, అంతర్జాతీయ రోమింగ్ సపోర్టు కూడా పొందవచ్చు. అంతేకాకుండా ఈ - వాలెట్స్,  యూపీ ఐ క్రెడిట్ లేదా డెబిట్ కార్డ్  ద్వారా కూడా  చెల్లింపులు  జరపడంతో పాటు సందేహాలు నివృత్తి , ఫిర్యాదులు వంటి ఇతర సమాచారాన్ని కూడా అందుకోవచ్చు.

ఇందుకోసం మీరు చేయవలసిందల్లా 7000770007  నంబర్ ను కస్టమర్ల కోసం జియో  ఏర్పాటు చేసింది. ఈ నెంబర్ ను కస్టమర్లు ఈ సేవలకు వినియోగించాల్సి ఉంటుంది. అయితే ప్రస్తుతం కేవలం రెండు భాషలోనే అంటే   హిందీ , ఇంగ్లీష్ భాషలలో సేవలు అందుబాటులో ఉన్నాయి. ఇక త్వరలోనే ఇతర భాషలలో కూడా పరిచయం చేయనున్నారు. అలాగే ఈ నెంబర్ కు త్వరలోనే జియో ఫైబర్ సేవలు కూడా అనుసంధానం చేయనున్నారు. వాట్స్అప్ చాట్ బాట్ ద్వారా covid 19 వ్యాక్సిన్ యొక్క సమాచారం కూడా పొందవచ్చు.


మరింత సమాచారం తెలుసుకోండి: