సాధారణంగా పాన్ కార్డ్ అనేది ప్రతి వ్యక్తికి చాలా అవసరం అనే విషయం అందరికీ తెలిసిందే. ముఖ్యంగా బ్యాంకులలో  పెద్ద మొత్తంలో లావాదేవీలు జరపాలి అంటే ఖచ్చితంగా పాన్ కార్డు ఉండాల్సిందే.లేకపోతే అధికంగా టాక్స్ రూపంలో చెల్లించాల్సి ఉంటుంది. ముఖ్యంగా 49 వేల రూపాయలు దాటింది అంటే కచ్చితంగా పాన్ కార్డు నంబర్ ఇచ్చి తీరాల్సిందే. ఇలాంటి ఎంతో ప్రాధాన్యం ఉన్న పాన్ కార్డు ఒకవేళ పోతే.. ఇక పాన్ కార్డు పోతే మాత్రం చాలా మంది భయపడుతూ, కంగారు పడుతూ ఉంటారు. అంతే కాదు ఆధార్ కార్డు నెంబర్ ను గుర్తుపెట్టుకునే  అంత సులభంగా, ఈ పాన్ కార్డు నెంబరును చాలా మంది గుర్తుపెట్టుకో లేకపోతున్నారు.. పాన్ కార్డు పోతే ఇప్పుడు ఎలా..? ఏం చేయాలి..? అనే సందేహం లో ప్రతి ఒక్కరూ టెన్షన్ పడుతూ ఉంటారు..

ఇప్పుడు ఎలాంటి టెన్షన్ లేకుండా, ఒకవేళ మీరు పాన్ కార్డు పోగొట్టుకున్నా, పాన్  నెంబర్ గుర్తుకు లేకపోయినా కేవలం పది నిమిషాల్లోనే ఆధార్ కార్డ్  సహాయంతో తిరిగి పొందవచ్చు.. అది ఎలానో ఇప్పుడు ఇక్కడ చదివి తెలుసుకుందాం..

1. ముందుగా  https://www.incometax.gov.in వెబ్ సైట్ ఓపెన్ చేయాలి.

2. మౌస్  సహాయంతో కొంచెం స్క్రాలు డౌన్ చేస్తే మీకు అక్కడ "అవర్ సర్వీసెస్ " అనే ఆప్షన్ కనిపిస్తుంది. ఇక అందులో షో మోర్ అనే ఆప్షన్ ను  క్లిక్ చేయగానే, వెంటనే మీకు ఇన్స్టెంట్ ఈ - పాన్  కనిపిస్తుంది. ఇక అక్కడ దానిపై క్లిక్ చేయాల్సి ఉంటుంది.

3. ఈ వేళ మునుపెన్నడూ మీరు ఈ - పాన్ ను కనుక డౌన్లోడ్ చేయకపోతే గెట్ న్యూ ఈ - పాన్ ఆప్షన్ పై క్లిక్ చేసి , మీ ఆధార్ నెంబర్ ను  ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అక్కడ ఇచ్చిన డిక్లరేషన్ అంతా మొత్తం చదివి , కంటిన్యూ బటన్ పై క్లిక్ చేయాలి. తర్వాత మీ ఆధార్ నంబర్ కు అనుసంధానమైన ఫోన్ నెంబర్ కు ఓటిపి వస్తుంది. అలా మీ మొబైల్ నెంబర్ కు వచ్చిన ఓటీపీ ని ఎంటర్ చేయాలి. ఇక వెంటనే మీ పాన్ కార్డు వివరాలు అక్కడ కనిపిస్తాయి. దగ్గర్లో ఉన్న మీసేవ కేంద్రానికి వెళ్లి, మునుపు లాగే కార్డు రూపంలో ప్రింట్ చేయించుకోవచ్చు.


మరింత సమాచారం తెలుసుకోండి: