అపర  కుబేరుడు ఎలన్ మస్క్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.ఆర్టిఫిషియల్‌ ఇంటిలిజెన్స్‌కి సరి కొత్త అర్థం చెప్పిన వారిలో ఎలన్‌ మస్క్‌ ఎప్పుడు టాప్ లో ఉంటారు. పేపాల్‌ సంస్థ సీఈవోగా, స్పేస్‌ ఎక్స్‌ సంస్థ అధినేతగా, టెస్లా సంస్థ సీఈవోగా.. ప్రపంచ దేశాల టాప్ కుబేరుల్లో ఒకడిగా ఎలన్‌ మస్క్‌ ఎదిగాడు. ఇక ఎలన్ మస్క్ ఆటోపైలట్‌ మోడ్‌ లేదా సెల్ఫ్‌ డ్రైవింగ్‌ కారుకు సంబంధించి ఆర్టిఫిషియల్‌ ఇంటిలిజెన్స్‌పై చాలా కాలంగా వర్క్‌ చేస్తున్నారు.ఇక ఎస్‌ ప్లెయిడ్‌ ప్రారంభానికి ముందు ఈ సంవత్సరం జనవరిలో ఎలన్‌ మస్క్‌ మాట్లాడుతూ.. ఈ సంవత్సరంలోనే డ్రైవరు లేకుండా నడిచే కారు అందుబాటులోకి వస్తుందంటూ సంచలన ప్రకటన చేయడం జరిగింది. ఇక దీంతో జూన్‌ నెలలో విడుదలైన ఎస్‌ ప్లెయిడ్‌లో డ్రైవర్‌ లెస్‌ ఆప్షన్‌ కూడా ఉంటుందని అందరూ భావించారు. కానీ ఆ ఫీచర్‌ని మాత్రం ఎస్‌ ప్లెయిడ్‌లో టెస్లా అందివ్వలేదు.

ఇక డ్రైవర్ లేని ఆటో పైలెట్‌ కారును ఇప్పుడప్పుడే మార్కెట్‌లోకి తీసుకురావడం కష్టమని ఎలన్‌ మస్క్‌ తాజాగా అంగీకరించడం జరిగింది. ‘ సెల్ఫ్‌ డ్రైవింగ్‌ టెక్నాలజీ అనేది చాలా జటిలమైనది, ఈ టెక్నాలజీని నిజం చేయాలంటే, వాస్తవిక ప్రపంచానికి తగినట్లుగా ఆర్టిఫిషియల్‌ ఇంటిలిజెన్స్‌ని రూపొందించాలి. ఇక ఈ పని చాలా కష్టంతో కూడుకున్నది. ఈ విషయాన్ని నేను ఇంతకు ముందు ఊహించలేదు. వాస్తవితకకు ఉన్నంత ఫ్రీడమ్ మరి దేనికి లేదు’ అంటూ ఇటీవల ఎలన్‌ మస్క్‌ తన అభిప్రాయం వ్యక్తం చేయడం జరిగింది.ఇక సెల్ఫ్‌ డ్రైవింగ్‌కి గతంలో తాము చేసిన ప్రకటనలు అన్నీ వాస్తవికంగా అమల్లోకి తేవడానికి అనుకూలంగా లేవంటూ టెస్లా కంపెనీ తెలిపింది. అలాగే మరోవైపు ఆటో పైలెట్‌ ఇంకా లెవల్‌ 2లోనే ఉన్నట్టుగా కూడా చెప్పింది. లెవల్‌ 2 అనగా ఆటో పైలెట్‌ ఆప్షన్ ఉన్నప్పటికీ ఖచ్చితంగా కారులో డ్రైవర్‌ ఉండాల్సిందే. ఇది కేవలం డ్రైవర్‌ యొక్క భారాన్ని మాత్రమే తగ్గిస్తుందే తప్ప పూర్తిగా డ్రైవింగ్‌ చేయలేదట.

మరింత సమాచారం తెలుసుకోండి: