టెక్నాలజీ వల్ల మానవాళి జీవన విధానంలో ఎంతో మార్పు వచ్చింది. ఈ టెక్నాలజీతో రోజురోజుకూ ఇంకా అభివృద్ధి చెందుతూనే ఉంటుంది. అందుకే ఎడ్యుకేషన్, జాబ్ మార్కెట్‌లో భవిష్యత్తు టెక్నాలజీదే అని ఇప్పటికే నిపుణులు చెప్పారు. ప్రధానంగా రోబోటిక్స్, ఆటోమేషన్ టెక్నాలజీలో పట్టు సాధించిన యువతకు బోలెడు ఉద్యోగాలుఉంటాయని వివరిస్తున్నారు.రోబోలతో ఫ్యూచర్ లో ప్రపంచం నడుస్తుందని టెక్నాలజీ నిపుణులు అంటున్నారు. కానీ, ఇప్పటికే రోబోలను చాలా చోట్ల ఇన్‌స్టాల్ చేశారు. వాటి వినియోగం భవిష్యత్తులో ఇంకా విరివిగా ఉండబోతుంది. ముఖ్యంగా యువత ఈ తరహా టెక్నాలజీని నేర్చుకుంటే, వారి కెరీర్ అత్యద్భుతంగా ఉంటుందని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.ఏఐ, ఎంఎల్, రోబోట్స్, కోబోట్స్, బిగ్ డేటా, 5జీ, అగ్మెంటెడ్ అండ్ వర్చువల్ రియాలిటీ, 3డీ, 4డీ ప్రింటింగ్ టెక్నాలజీలు భవిష్యత్‌ను దిశా నిర్దేశం చేస్తాయని టెక్ నిపుణులు పేర్కొంటున్నారు. ఈ టెక్నాలజీలను అందిపుచ్చుకుని ముందుకు వెళ్లే యువతకు చక్కటి ఉద్యోగ అవకాశాలుంటాయి.దేశంలోనే కాదు ప్రపంచంలోనూ రోబోటిక్స్ ఇంజినీరింగ్ అనేది హై ఎండ్ జాబ్ గా ఉండబోతుంది. రోబోటిక్స్‌లో ప్రొఫెషనల్ ఎక్స్‌పర్ట్ అయితే ప్రపంచవ్యాప్తంగా ఫుల్ డిమాండ్ ఉంటుంది. రోబోటిక్స్‌ చదువుకున్న వ్యక్తి ఫ్రెషర్ అయినా నెలకు రూ.5 లక్షల వరకు భవిష్యత్తులో ఇస్తారని అంచనా వేస్తున్నారు.


రోబోటిక్స్ హై ఎండ్ సబ్జెక్ట్ మాత్రమే కాదు చాలా డిమాండ్ ఉన్న టెక్నాలజీగా భవిష్యత్తును శాసిస్తుంది.ఇప్పటికే మెషిన్ డిజైన్, ప్రోగ్రామింగ్, ఎంబెడెడ్ సిస్టమ్స్, ఐఓటీ, మ్యాథమెటిక్స్ పైన యువత ఫుల్ ఫోకస్ పెట్టింది. ఈ క్రమంలోనే ఆటోమేషన్, రోబోటిక్స్‌పైన పట్టు సాధిస్తే భవిష్యత్తు వారిదేనని అంటున్నారు. మార్కెట్‌లో డిమాండ్ ఉన్న టెక్నాలజీలను అంచనా వేసి అది నేర్చుకున్నట్లయితే ఉద్యోగాలు త్వరగా లభిస్తాయని పెద్దలు చెప్తుంటారు. అలా ఇప్పటికే సాంకేతిక విప్లవం పీక్స్‌కు చేరిన నేపథ్యంలో యువత రోబోటిక్స్, ఆటోమేషన్‌పైన దృష్టి సారించే అవకాశాలు మెండుగా కనబడుతున్నాయి.దేశంలో ఇప్పటికే అండర్ గ్రాడ్యుయేట్ కోర్సులుగా మెకాట్రానిక్స్ ఇంజినీరింగ్, ఆటోమేషన్, రోబోటిక్స్ ఇంజినీరింగ్‌లను పలు సంస్థలు ప్రవేశపెట్టాయి. కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్, మెకానికల్ ఇంజినీరింగ్, ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్ కోర్సులతో పాటు రోబోటిక్స్, ఆటోమేషన్ కోర్సులనూ నూతనంగా ప్రవేశపెట్టారు. ఇక ఇప్పటికే ఇతర కోర్సులు చదివి ఉద్యోగాలు చేస్తున్న వారు కూడా క్రాష్ కోర్సులుగా వీటిని నేర్చుకుని ఆ టెక్నాలజీలోకి వెళ్లొచ్చు.


మరింత సమాచారం తెలుసుకోండి: