
తమిళ హీరో విజయ్ ఆంటోనీ ప్రధాన పాత్రలో వస్తున్న లాయర్ సినిమాలో నటిస్తోంది ఆయేషా.. ఇక తెలుగులో కూడా సావిత్రమ్మ గారి కొడుకు సీరియల్ ప్రధాన పాత్రలో నటించిన ఆ తర్వాత తమిళ్ ,తెలుగు సీరియల్స్లలో నటించింది. నిరంతరం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ఏవో ఒక ఫోటోలను షేర్ చేస్తూ ఉంటుంది అయేషా. తాజాగా ఈ ఆమ్మడు ఒక ప్రైవేట్ జెట్ లో కూర్చుని ఫోటోలకు ఫోజులు ఇచ్చిన ఫోటోలను షేర్ చేసింది. దీంతో ఆయేషా సొంత ఫ్లైట్ కొన్నారా? అనే ప్రశ్నలు కూడా నెటిజెన్లు కామెంట్స్ రూపంలో ఈమెకు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. మరి ఇందుకు సంబంధించి అధికారికంగా ప్రకటన అయితే తెలియజేయాల్సి ఉన్నది.
కానీ ఆయేషా ప్రైవేట్ విమానం దగ్గర ఫోటోలను చాలా ఆశ్చర్యపోతున్నారు.. తను దిగిన స్టైలిష్ గా ఫోటోలు చూసి ప్రైవేట్ విమానం కొనుగోలు చేసిందని అనుమానాలు మరింత బలపరుస్తోంది. గత ఏడాది కిర్రాక్ బాయ్స్ కిలాడీ గర్ల్స్ షోలో కూడా పాల్గొనింది ఆయేషా .ప్రస్తుతం శ్యామల ఎక్స్ప్రెస్ అనే షో కి యాంకర్ గా వ్యవహరిస్తున్నది. ఆయేషా పలు రకాల వెబ్ సిరీస్లలోనే కాకుండా షార్ట్ ఫిలింలో కూడా నటించి బాగానే క్రేజ్ సంపాదించుకుంది.