మామూలు టీవీ లు కొనేవారు అన్నీ రకాలుగా దానికి పరీక్షించి కొంటారు. ఎందుకంటే వేలకు వేలు డబ్బులు పోసి కొంటారు. అన్నీ విధాలుగా పనికొచ్చే లా టీవీ లని ఎరి కోరి కొంటారు. అయితే ఇప్పుడు మార్కెట్ లో ఔరా అణిపిం చేలా ఒక టీవీ దర్శనమిచ్చింది. చూపరులను విపరీతంగా ఆకట్టుకుంది ఆ టీవీ ఎంటో ఒకసారి చూసేద్దాము..



సైజ్‌ నుంచి స్లిమ్‌ వరకు దేనికదే కొత్తగా కనిపిస్తోంది. ఈ ఏడాది కూడా కొత్త టీవీలు మార్కెట్లో హల్‌ చల్‌ చేసే సూచనలే మెండుగా ఉన్నాయి. సీత్రూ గ్లాస్‌లా కనిపించే టీవీలు రాబోతున్నాయి. సోఫాలో నో, బెడ్‌లోనో ఇమిడిపోయి ఉండి, బటన్‌ నొక్కగానే పైకి వస్తాయి. బటన్‌ ఆఫ్‌ చేయగానే సాదారణ గ్లాస్‌లా మారిపోయి లోపలికి వెళతాయి. ఆల్‌ డిజిటల్‌ కన్జుమర్‌ టెక్‌ కాన్ఫరెన్స్‌లో ఎల్‌జి  కంపెనీ ఇలాంటి టీవీ ను మార్కెట్ లోకి విడుదల చేసింది.



టీవీ ప్రత్యేకతల విషయానికొస్తే..ట్రాన్స్‌పరెంట్‌ టీవీలు మొత్తంగా కొత్తవేం కాదు. ఇప్పుడు ఉన్నంత స్మార్ట్‌గా కాకున్నా 55 ఇంచీల ట్రాన్స్‌రెంట్‌ టీవీలను 'షావోమీ' గత ఆగస్టులోనే అందుబాటు లో తీసుకొచ్చింది. ధర కూడా 7 వందల డాలర్లు మాత్రమే.షాపింగ్‌ మాల్స్‌, ఆర్ట్‌ మ్యూజియమ్స్‌, హై-ఎండ్‌ రెస్టారెంట్ల వంటి వాటి దగ్గర వీటిని పెడితే ఉపయోగం ఉందని చెబుతున్నారు. అవసరమైనప్పుడు ఇది టీవీలా, తరవాత ఒక పార్టిషన్‌ గ్లాస్‌లా ఉపయోగపడుతుందని చెబుతున్నారు.. ఈ టీవీ చూడటానికి ఒక అద్బుతం లాగా పనిచేస్తాయి. దాంతో వినియోగదారుల ఇష్టాన్ని బట్టి టీవీని ఎక్కడైనా అమర్చుకోవచ్చు. ప్రస్తుతం ఈ రకమైన టీవీ లో ప్రజలను ఆకట్టుకుంటున్నాయి. ఒక మాయా ప్రపంచం లోకి తీసుకెళ్తున్నాయి. దాంతో టీవీ కి డిమాండ్ కూడా భారీగా పెరిగింది. ఫ్యుచర్లో ఇలాంటి టీవీ లు వస్తాయేమో చూడాలి...
మరి కొద్ది రోజుల్లో ఇండియాకి వస్తాయని సమాచారం..

మరింత సమాచారం తెలుసుకోండి: