సమాజాభివృద్ధిలో అటు ఇంజనీర్లు ఎంత కీలక పాత్ర పోషిస్తూ ఉంటారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కలలో కూడా ఊహించని సరికొత్త ఆవిష్కరణలతో ఎప్పుడు అద్భుతాన్ని సృష్టిస్తూ ఉంటారు అని చెప్పాలి. అసాధ్యం అనుకున్న దాని సుసాధ్యం చేసి చూపిస్తూ ఇక సరికొత్త సమాజాన్ని నిర్మించేది అటు ఇంజనీర్లే అని ప్రతి ఒక్కరు చెప్పే విధంగా తమ ప్రతిభను నిరూపిస్తూ ఉంటారు అని చెప్పాలి. ఇలా ఇప్పటివరకు ఎంతోమంది ఇంజనీర్లు తమ ప్రతిభతో అద్భుతాలు సృష్టించి అందరిని అవాక్కయ్యేలా చేశారు. ఇప్పుడు ఓ ఇంజనీర్స్ స్వతహాగా ఒక అద్భుతమైన పరికరాన్ని తయారుచేసి శభాష్ అనిపించుకుంటున్నాడు.


 ఏకంగా మనిషి కళ్ళల్లోనే ఫ్లాష్ లైట్ ని తయారు చేశాడు ఈ ఇంజనీర్. అమెరికాకు చెందిన 30 ఏళ్ల బ్రియాన్ స్టాండ్లీ అనే ఒక ఇంజనీరు క్యాన్సర్ కారణంగా తన ఎడమ కంటిని కోల్పోయాడు. ఇక ఎడమ కన్ను లేదు అని అతను బాధపడలేదు. ఏదో ఒకటి కొత్తగా ప్రయత్నించాలని నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలోనే తనకున్న టెక్నాలజీ అనుభవంతో కృత్రిమ కంటిని  నిర్మించుకున్నాడు. ప్రొస్తేటిక్ ఐబాల్ ను ఫ్లాష్ లైట్ గా మార్చి కంటికి అమర్చుకున్నాడు. దీనిని టైటానియం సైబర్గ్ అని పిలుస్తారట. చీకట్లో కూడా బ్యాటరీ లాగా ఎంతో ప్రకాశిస్తూ ఉండడం గమనార్హం. 20 గంటల పాటు ఇది పనిచేస్తుందని చెబుతున్నాడు సదరు వ్యక్తి. ఇందుకు సంబంధించిన వీడియో కాస్త వైరల్ గా మారిపోయింది.


 ఇక తాను కనుగొన్న అద్భుతమైన ఆవిష్కరణకు సంబంధించి ఒక వీడియోని సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేయడంతో అధి కాస్త అందరి దృష్టిని ఆకర్షిస్తూ వైరల్ గా మారిపోయింది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అతనికి ఇలాంటి ఐడియా ఎలా వచ్చిందో కానీ హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే అంటూ ఎంతో మంది నేటిజన్స్  కామెంట్లు చేస్తూ ఉన్నారు అని చెప్పాలి. ఇక అతను తయారుచేసిన పరికరం కేవలం అతనికి మాత్రమే కాదు ఎంతోమందికి ఉపయోగకరంగా ఉంది అంటూ మరి కొంతమంది కామెంట్లు చేస్తూ ఉండడం గమనార్హం. మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ వీడియో చూసేయండి.

మరింత సమాచారం తెలుసుకోండి: