ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో ఎన్నో రకాల వీడియోలు వైరల్ గా మారిపోతూనే ఉన్నాయి అన్న విషయం తెలిసిందే. ఇక ఇలా వైరల్ గా మారిపోయిన వీడియోలు ఎంతోమందిని ఆశ్చర్యానికి గురిచేస్తూ ఉంటాయి. ముఖ్యంగా సోషల్ మీడియాలో ఏదో ఒకటి చేసి పాపులారిటీ సంపాదించుకోవాలని భావించేవారు నేటి రోజుల్లో ఎక్కువైపోతున్నారు. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో లైక్ ల మాయలో పడిపోతున్న ఎంతోమంది విలువైన ప్రాణాలను ప్రమాదంలో పెట్టుకొని మరి ఎన్నో విన్యాసాలు చేస్తూ ఉన్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి.


 ముఖ్యంగా ఇలా సోషల్ మీడియాలో పాపులారిటీ కోసం బైక్ విన్యాసాలు చేస్తున్న వారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతుంది తప్ప ఎక్కడ తగ్గడం లేదు అని చెప్పాలి. ఇక ఇలాంటి విన్యాసాలకు సంబంధించిన వీడియోలు ఏమైనా సోషల్ మీడియాలోకి వచ్చాయి అంటే చాలు ఇదేం పోయేకాలం అని ప్రతి ఒక్కరికి అనిపిస్తూ ఉంటుంది అని చెప్పాలి. ఇక ఇక్కడ ఇలాంటి తరహా వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ చక్కర్లు  కొడుతుంది. సాధారణంగా బైక్ పై కేవలం ఒకే ఒక్కడు ఉన్నప్పుడు మాత్రమే విన్యాసాలు చేయడం ఇప్పటివరకు చూసాం. కానీ ఇక్కడ వైరల్ గా మారిపోయిన వీడియోలో మాత్రం వెనకాల భార్య కూర్చున్న అతడు విన్యాసాలు ఆపలేదు.



 ఓ వ్యక్తి తన భార్యతో కలిసి రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ పై వెళుతూ ఉన్నాడు. అయితే బైక్ నడుపుతున్న వ్యక్తి మొదట సాధారణంగానే డ్రైవింగ్ చేశాడు. కానీ వేగం పెరిగిన కొద్దీ విన్యాసాలు చేయడం ప్రారంభించాడు. బైక్ సీట్ పై రెండు కాళ్లు ఉంచాడు. ఆ తర్వాత నెమ్మదిగా హ్యాండిల్ వదిలేస్తాడు ఇక బైక్ పై నిల్చుని అలాగే జర్నీ చేశాడు. ఇక ఇదంతా చేస్తున్న సమయంలో వెనకాల సీట్ లో భార్య ఇక చీర కట్టుకొని తన ముఖం కనిపియ్యకుండా నిండా కప్పుకుని కూర్చొని ఉంది. భర్త అలా చేస్తూ ఉంటే కనీసం వద్దు అని కూడా చెప్పలేదు. ఇక ఇది చూసిన నేటిజన్స్  పోయేకాలం అంటే ఇదే అంటూ కామెంట్లు చేస్తూ ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: