ఇటీవల కాలంలో మెట్రో ట్రైన్ ప్రయాణం ఎంతలా ఎక్కువైపోయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు . ట్రాఫిక్ అంతరాయం లేని ప్రయాణం కావడంతో ఇక ఎంతోమంది ఈ మెట్రో ట్రైన్ ని ఆశ్రయిస్తూ ఉన్నారు అని చెప్పాలి. ముఖ్యంగా దేశ వాణిజ్య  రాజధానిగా పిలుచుకునే  ముంబైలో ఎక్కువమంది ఇక రోజువారి ప్రయాణాలను మెట్రో ట్రైన్ ద్వారానే సాగిస్తూ ఉంటారు. అయితే ఇలా మెట్రో ట్రైన్ లో ప్రయాణిస్తున్న ఎవరైనా సరే తోటి ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా నడుచుకోవాల్సి ఉంటుంది.



 కానీ కొంతమంది మాత్రం ఏకంగా తమ సొంత డబ్బుతో మెట్రో ట్రైన్ కొని ప్రయాణిస్తున్నాము అన్న విధంగా వ్యవహరిస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే తోటి ప్రయాణికులకు ఇబ్బంది కలిగిస్తూ చిత్ర విచిత్రంగా ప్రవర్తించడం లాంటివి చేస్తూ ఉంటారు అని చెప్పాలి. ఇక ఇప్పుడు ఒక యువతి ఇలాగే ప్రవర్తించిన వీడియో కాస్త ట్విట్టర్ వేదికగా వైరల్ గా మారిపోయింది అని చెప్పాలి. తన స్నేహితుడితో కలిసి కూర్చుంది యువతి. ఈ క్రమంలోనే ఎదురుగా ఉన్న సీట్లో కాలును చాపి కూర్చుంది. అయితే ఆ సీటు పక్కనే కూర్చున్న ప్రశాంత్అనే ప్రయాణికుడు ఆమె కాలును తీయాలి అని కోరాడు.


 తోటి ప్రయాణికుడు ప్రశాంత్ ఇలా చెప్పిన సమయంలో ఇక సదరు మహిళ కాలుని పక్కకు తీయకుండా... ఏకంగా అతనితో వాగ్వాదానికి  దిగింది. కాగా ఆమె పక్కనే కూర్చున్న స్నేహితుడు.. సైతం ప్రశాంత్ తో వాగ్వాదానికి దిగాడు అని చెప్పాలి. ఈ క్రమంలోనే అక్కడ జరుగుతున్నదంతా వీడియోని తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు ఒక జర్నలిస్ట్.  ట్విట్టర్ లో ఈ వీడియో కాస్త వైరల్ గా మారిపోయింది అని చెప్పాలి. అయితే ఇక ఈ పోస్ట్ కి ముంబై పోలీసులు, రైల్వే అధికారులను కూడా ట్యాగ్ చేయడం గమనార్హం. ఈ ఘటన పై స్పందించిన ముంబై పోలీసులు కామెంట్స్ సెక్షన్లో ముంబై రైల్వే ప్రొటెక్షన్ ఫోర్సును ట్యాగ్ చేశారు. సిటు ఖాళీగా ఉన్న మరో సీటుపై ప్రయాణికులు కాలు మోపడం సరైన పద్ధతి కాదని నేటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: