టూత్ బ్రెష్ అండ్ టూత్ పేస్ట్ ఈ రెండు వస్తువులు మనకు తెలిసినవే. పొద్దున లేవగానే మనము పళ్లు తోముకునేది ఈ రెండు వస్తువులతోనే. అయితే ఇప్పుడు టూత్ పేస్ట్ , ఈ బ్రెష్ మీద వేసి తోమితే ఏవో సమస్యలు తలెత్తుతాయని వైద్యులు అంటున్నారు.. అయితే ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరు టూత్ పేస్ట్ తోపాటు బ్రష్ ను ఉపయోగిస్తున్నారు.. ఇక ఇలా తోమకపోతే మరి ఎలా తోమాలి..? అని ప్రతి ఒక్కరిలోనూ సందేహం కలుగుతుంది. అయితే ఇలా పళ్లు తోమడం వల్ల ఏమవుతుందో..? ఇప్పుడు ఇక్కడ చదివి తెలుసుకుందాం.


టూత్ పేస్ట్ వలన థైరాయిడ్ సమస్యలు కలుగుతాయని తేలింది. క్రిములను నాశనం చేసే టూత్ పేస్టు లలో  'ట్రేక్లోసెన్ ' అనే రసాయనాన్ని కలుపుతారు. మొదట్లో ఈ రసాయనం పురుగు మందుల తయారీలో వాడే వారు.
ఈ టూత్ పేస్ట్ లు వాడడం వలన థైరాయిడ్ సమస్యలు,  గుండె సమస్యలు, క్యాన్సర్ వంటి సమస్యలు తలెత్తుతాయని  నిపుణులు హెచ్చరిస్తున్నారు. టూత్ పేస్ట్ లు' పాలీ ఇథైలీన్  ' ను కలిగి ఉంటాయి. దీనిని సాధారణంగా ప్లాస్టిక్ అని కూడా అంటారు. ఈ పదార్థం శరీరానికి విషపదార్థం వలే పనిచేసి, మూత్రపిండాలను, గుండె మరియు మెదడును ప్రమాదానికి గురి చేస్తుంది.


టూత్ పేస్ట్ తయారీలలో ఫ్లోరైడ్ లను కూడా వాడుతారు. ఇది చిగుళ్ళను మాత్రమే కాకుండా, పిల్లల తెలివి తేటలను తగ్గించి వేస్తాయి. అంతేకాకుండా ఎముకలు ప్రమాదానికి గురవడం మరియు పొట్ట లో సమస్యలను కలుగజేస్తాయి. సోప్ లలో వాడే సోడియం లారీల్ సల్ఫేట్ ను  టూత్ పేస్ట్  తయారీలో కూడా వాడతారు. వీటివలన నోటిలో అల్సర్,చర్మ సమస్యలు కలుగుతాయి.


టూత్ పేస్టు లలో చక్కెరలు  కూడా ఎక్కువగా ఉంటాయి టూత్ పేస్టు లలో ఉండే అస్పర్టమ్ అనే కృత్రిమ చక్కెర వలన మధుమేహం మరియు స్థూలకాయత్వం కలుగుతుందని పరిశోధనల్లో వెల్లడైంది. అంతేకాకుండా, టూత్ పేస్ట్ వలన బ్రెయిన్ ట్యూమర్  తో పాటు క్యాన్సర్ సమస్యలు కూడా కలిగే అవకాశం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: