ప్రస్తుతం ఉక్రెయిన్ రష్యా మధ్య యుద్ధం నేపథ్యంలో ఎక్కడ చూసినా యుద్ధానికి సంబంధించిన వార్తలే కనిపిస్తున్నాయి. ఇలాంటి సమయంలో ఇక యుద్ధం చేసే ఒక మొక్క గురించి ప్రస్తుతం ఒక వార్త హాట్ టాపిక్ గా మారిపోయింది. అంతేకాదు ఇక యుద్ధం చేసే మొక్క గురించి ఒక వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. కాస్త వివరాల్లోకి వెళితే ప్రకృతిలో ఎన్నో వింతలు మరెన్నో విచిత్రాలు అన్నీ మనకు తెలిసి ఉండవు.. కానీ చూస్తే మాత్రం ఆశ్చర్య పోకుండా ఉండలేము.




 ఇక ఇలాంటి అందరినీ ఆశ్చర్యపరిచే అద్భుతమే ఇక్కడ ఒక మొక్క. ఎవరైనా పట్టుకున్నారు అంటే చాలు యుద్ధం చేస్తూ తనని తాను కాపాడుకోవడానికి సిద్ధమైపోతుంది ఇక్కడ ఒక మొక్క. దీని పేరే వుడ్ సోరిల్. ఇవి చూడటానికి ఎంతో సాత్వికంగా ఉంటాయి.  రంగు రంగు పూలు పూస్తూ.. కాయలు కాస్తూ దీన్ని చూస్తే మనిషికి ఎంతో ఆహ్లాదాన్ని కలిగించేలా ఉంటాయి. ఈ మొక్కలు మనిషికి ఆహారంగా ఉపయోగపడే మొక్కలు కూడా కావడం గమనార్హం. అయితే ఇప్పటి వరకు ఎవరైనా ముట్టుకుంటే భయంతో ఊగిపోయిన ట్లుగా ముడుచుకుపోయే మొక్కలను మనం చూశాం.. కానీ ఇక్కడ మాత్రం ఎవరైనా ముట్టుకుంటే దగ్గరికి రావద్దు అన్న విధంగా యుద్ధం చేస్తోంది.


 వుడ్ సోరిల్ అని పిలువబడే మొక్కని ఎవరైనా పట్టుకున్నారు అంటే చాలు దానికి కోపం వస్తుంది. ఇక యుద్ధం కూడా చేస్తుంది. ఇక యుద్ధం చేయడం అంటే బాంబులు గట్రా లేదు కానీ దాని దగ్గర ఉన్న విత్తనాల ని ఆయుధాలుగా   ఆపకుండా మిస్సైల్ ప్రయోగించినట్లు  గా నాన్ స్టాప్ గా యుద్ధం చేస్తుంది. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. తన దగ్గర ఉన్న విత్తనాలను బాంబుల్లా భావిస్తున్న ఈ వీడియో చూసి అందరూ షాక్ అవుతున్నారు. మరీ ఇంకెందుకు  ఆలస్యం మీరు కూడా ఈ వీడియోపై ఒక లుక్కేయండి..

మరింత సమాచారం తెలుసుకోండి: