ఇండియా హెరాల్డ్... నేను దర్శకత్వం వహించి, నేను నిర్మించి, నేను శాసించి, నేను ఆశించి, నేను కాంక్షించి, నేను దారి చూపించిన నా అందమైన ప్రపంచం... వార్తలతో సమాజంలో మార్పు వస్తుంది... సమాజంలో నేను మార్పు తెస్తాను అనే పిచ్చి ఆలోచనలు, పిచ్చి మాటలు నేను చెప్పను నా దగ్గర లేవు. ఇండియా హెరాల్డ్ ద్వారా నేను సామాన్యుడికి నేను అనుకున్నది చెప్పాలి... ఉదయం కాఫీ తెచ్చి ఇచ్చే భార్యలా... సాయంత్రం నాన్నా అంటూ పొలం నుంచి వస్తుంటే ఎదురొస్తున్న పిల్లల్లా... స్కూల్ నుంచి వచ్చిన తర్వాత లాలించే అమ్మలా...

కోపం వచ్చి గొడవ చేసే అక్కలా... ఇది నేర్చుకోరా అని అరిచి చెప్పే నాన్నలా ఉండాలనేది నా కోరిక... నా ఆశయం అదే. ఉదయం లేచి యోగా ఎలాగో... సాయంత్ర సమయాన వాకింగ్ ఎలాగో... ఇండియా హెరాల్డ్ కూడా అలా మారాలనేది నా కోరిక... సమాజంలో నేను  మార్పు తెచ్చే అంత బలంగా ఉన్నానో లేదో నాకు తెలియదు... ఇండియా హెరాల్డ్ ద్వారా నీకు చెప్పే మాట గుర్తుండాలి అనేది నా బలమైన విశ్వాసం. నా పిల్లలు, నా తల్లి తండ్రులు, నా జీవిత భాగస్వామి నుంచి నాకు కావాల్సిన ప్రేమ ఉంది.

అలా లేని ఎన్నో ఒంటరి జీవితాలకు నేను ఒక పలకరింపు కావాలి... నా పిలుపు భుజం తట్టి ధైర్యం చెప్పాలి... నా మాట అమ్మ ప్రేమంత తీయగా సామాన్యుడిని పలకరించాలనేది నా ఆశయం. ఈ ప్రయాణంలో నేను సంతృప్తి చెందానా చెందుతున్నానా అనేది నేను ఆలోచించలేదు. కాని నేను స్థాపించిన సంస్థలో వేలాది మంది ప్రయాణం చేసినా... నా ఆలోచనను అందుకునే వారి కోసం నా ప్రయత్నం సాగుతూనే ఉంది. ఇండియా హెరాల్డ్ అనేది నా వ్యాపారమో నా వ్యాపకమో కాదు... నా తీయటి ప్రయాణం. ఈ ప్రయాణంలో నా ఆలోచనను అర్ధం చేసుకుని నడిస్తే సంస్థకు నేను సాధించి పెట్టిన బలమైన విజయంగా భావిస్తున్నాను...

మరింత సమాచారం తెలుసుకోండి: