ఆప‌ద‌లు, క‌ష్టాలు అంద‌రికీ వ‌స్తాయి. అయితే.. వీటిని త‌ట్టుకునే వారు ఉంటారు. కొంద‌రు త‌ట్టుకోలేని వారు కూడా ఉంటారు. త‌ట్టుకునేవారి గురించి ఎవ‌రూ పెద్ద‌గా ఆలోచించాల్సిన అవ‌స‌రం లేదు. ఆర్థికంగా.. చ‌దువు ప‌రంగా బాగానే ఉన్న‌వారికి క‌ష్టాలు వ‌స్తే.. ప‌రిష్కారాల కోసం వారు అనేక మార్గాలు వెతుక్కుంటారు. కానీ, ఆర్థికంగా బ‌లంగాలేని వారికి, ఏపూట‌కాపూట గ‌డించి పొట్ట నింపుకొనేవారికి క‌ష్టాలు వ‌స్తే.. ఎవ‌రు తీరుస్తారు? అందునా.. దీర్ఘ‌కాలిక స‌మ‌స్య‌లు.. అవి కూడా త‌మ క‌డుపున పుట్టిన వారికి వ‌స్తే.. ఎలా?

ఇలాంటివారి జీవితాలు ఇక‌, నాశ‌నం కావాల్సిందేనా..! ఇలాంటి కుటుంబాల్లో స‌మ‌స్య‌ల‌ను మెడ‌లో వేసుకుని పుట్టిన వారు.. అక్క‌డితో వారి జీవితాల‌ను అంతం చేసుకోవాల్సిందేనా ? అంటే.. కాద‌నే అంటున్నారు పినాకిల్ బ్లూమ్స్ వ్య‌వ‌స్థాప‌కులు, ప్ర‌ముఖ వైద్యురాలు.. డాక్ట‌ర్ శ్రీజారెడ్డి. పేద‌ల‌కు, ఆప‌న్నుల‌కు నేనున్నానంటూ.. ఆమె అభ‌యం ప్ర‌సాదిస్తున్నారు. ఆటిజం.. అనిపిలిచే బుద్ధిమాంద్యం, ఇత‌ర జ్ఞానేంద్రియాల్లో లోపాల‌ స‌మ‌స్య‌తో జ‌న్మించే చిన్నారులకు వైద్యం అందించే సంస్థే పినాకిల్ బ్లూమ్స్‌.

అయితే, ఆటిజం, పైన చెప్పుకున్న‌ట్టు జ్ఞానేంద్రియాల్లో ఎంతో కొంత లోపాల‌కు సంబంధించి చికిత్స దీర్ఘ‌కాలికంగా కొంద‌రికి అవ‌స‌రం ఉంటుంది. అదే స‌మ‌యంలో ఈ చికిత్స‌లు అన్నీ కూడా ఖ‌ర్చుతో కూడుకున్న‌వే కావ‌డం గ‌మ‌నార్హం. మ‌రి పేద‌ల కుటుంబాల్లో జ‌న్మించిన చిన్నారుల ఆటిజం స‌మ‌స్య‌ను తీర్చేందుకు ఆ కుటుంబాల్లో ఆర్థిక భారం అయితే.. ఏం చేయాలి ? ఇలాంటి స‌మ‌స్య‌లు త‌న వ‌ద్ద‌కు వ‌చ్చిన‌ట్టు కోటి ఫౌండేష‌న్ ద్వారా వారికి ఉచితంగా సేవ‌లు అందిస్తున్నారు డాక్ట‌ర్ శ్రీజారెడ్డి.


మ‌ధ్య త‌ర‌గ‌తి కుటుంబాల‌కు 33 నుంచి 50 శాతం వ‌ర‌కు రాయితీతోనే ఈ సేవ‌లు అందిస్తున్నారు. అంతేకాదు.. స‌ద‌రు చిన్నారుల‌కు ఉత్త‌మ‌మైన , నాణ్య‌మైన వైద్యం అందిస్తూ.. వారి జీవితాల్లో వెలుగులు పూయిస్తున్నారు. మేమున్నామ‌ని.. మీకేం కాద‌ని.. అంటూ.. ఆప‌న్నుల‌కు.. ఆరోగ్యం ప్ర‌సాదిస్తున్నారు శ్రీజారెడ్డి.











మరింత సమాచారం తెలుసుకోండి: