అందానికి ప్రతిరూపాలుగా నిలిచే ఆడవారు తమ అందానికి కొలమానంగా మిస్ ఇండియా వరల్డ్ కప్ వంటి పోటీలలో పాల్గొంటూ ఉంటారు. ఎప్పటినుంచో ఆడవారి అందాలకు కొలమానంగా ఈ పోటీలు నిర్వహిస్తూ వస్తున్నారు నిర్వాహకులు.  అలాంటి పోటీలలో గెలిచిన వారు ప్రపంచంలోనే అందమైన సుందరిగా పేరు ప్రఖ్యాతలు దక్కించుకుంటారు. ఆ విధంగా ఇప్పటి వరకు ఎంతో మంది సుందరీమణులు తమ అందచందాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ ప్రపంచంలోనే అత్యంత సుందరమైన సుందరీమణులు గా ఎంపికయ్యారు.

ఇండియా నుంచి ఎంతోమంది  సుందరీ మణులు మిస్ వరల్డ్ గా ఎంపికయ్యారు. ప్రపంచ సుందరి అంటే అంత మామూలు విషయం కాదు. 1966 నుంచి 2017 వరకు మొత్తంగా ఆరుగురు సుందరీమణులు మిస్ వరల్డ్ గా ఎంపికయ్యారు. వారిలో ఫిజిషియన్ రైటా ఫరియా మొదటిసారిగా ఇండియా నుంచి ప్రపంచ సుందరిగా ఎంపికయింది. ఆ తరువాత ఐశ్వర్య రాయ్ బచ్చన్ , ప్రియాంక చోప్రా డయానా హెడెన్, యుక్తా ముఖి వంటి వారు ప్రపంచ సుందరిగా ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను అలరించారు. వీరు ఆ తర్వాత సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి తమ దిన నటనతో ప్రేక్షకులను ఉర్రుతలూగించారు. 

ఇకపోతే తాజాగా యు ఎస్ లో జరిగిన మిస్ ఇండియా పోటీల్లో కిరీటం ని మిషిగన్ కి చెందిన 25 సంవత్సరాల వైదేహి దోంగ్రి దక్కించుకున్నారు. మిచిగాన్ యూనివర్సిటీ నుంచి డిగ్రీ పట్టా అందుకున్న ఈ యువతి బిజినెస్ డెవలప్మెంట్ మేనేజర్ గా పనిచేస్తున్నారు. ఈ అందాల పోటీలో జార్జియా కు చెందిన ఆర్షి తొలి రన్నరప్ గా నిలిచారు. మహిళలు ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి అక్షరాస్యతను పెంపొందించడమే తన లక్ష్యమని వైదేహి చెప్పారు. మహిళల అభ్యున్నతికి తాను ఎంతగానో తోడ్పడతానని తనకు వచ్చిన ఈ కిరీటాన్ని ఎంతో గౌరవంగా, గర్వంగా భావిస్తున్నారని అని చెప్పింది. భవిష్యత్తులో ఈమె సినిమా లో ఏమైనా నటిస్తుందో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: