నేటి రోజుల్లో భారత ప్రభుత్వం ఎన్ని కఠిన చట్టాలు అందుబాటులోకి తెస్తున్నా ? నిందితులను ఎంత కఠినముగా శిక్షిస్తున్నా మారడం లేదు సరి కదా ఇంకా అఘాయిత్యాలు ఎక్కువ అవుతున్నాయి. ఇలా ఓ మహిళకు లేదా అమ్మాయికి ఒక సంఘటన జరిగితే తాను ఆ ఘటన గురించి చెప్పుకోవడానికి ఎంతో ఇబ్బంది పడుతారు. ఒకవేళ చెబితే తన పరువు పోతుంది అన్న ఒక్క భయంతో వెనకడుగు వేస్తారు. కానీ ఎలాగోలా మానభంగం జరిగింది అని తెలిసిన తర్వాత... ఆ విషయాన్ని నిర్దారణ చేసుకోవడానికి డాక్టర్స్ పరీక్షలు చేయడం చూస్తూ ఉంటాము. ఆ పరీక్షల్లో ఒకటి టూ ఫింగర్ టెస్ట్. ఒక మహిళా మానాన్ని ప్రాణంగా బావిస్తుంటే ఇలాంటి పరీక్షలు చేయడం చాలా దారుణం.

అయితే ఈ టెస్ట్ ను చేసే క్రమంలో బాధితురాలు ఎంతలా వేదన అనుభవిస్తుంది అన్నది ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. డాక్టర్ తన రెండు వేళ్ళను ఆ అమ్మాయి మర్మాంగంలో పెట్టి కన్నెపొర చిట్లిందా లేదా అని చూసి రేప్ జరిగిందా లేదా అన్న విషయాన్ని నిర్దారించేవారు. అయితే ఇంతకు ముందు ఇలాంటి పరీక్షలు జరిగిన ఉన్న కూడా ఇకపై అలాంటివి జరగకుండా సుప్రీమ్ కోర్ట్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ వెంటనే నిలిపి వేయాలని నిర్ణయం తీసుకుంది. ఈ క్షణం నుండి ఈ నిర్ణయం అమలు అయ్యేలా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని సుప్రీం కోర్ట్ ఆదేశించింది. ఇకపై ఎవరైనా ఇలాంటి పరీక్షలు నిర్వహిస్తే వారిని దుష్ప్రవర్తన నేరం కింద పరిగణించాలని ఆదేశించింది.

ఈ రోజుతో మహిళలు ఇంతకాలం అనుభవిస్తున్న నరకయాతనకు శుభం కార్డు పడింది. సుప్రీం కోర్ట్ తీసుకున్న ఈ నిర్ణయం పట్ల మహిళలు , మహిళా సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. దీని వలన అమ్మాయి చెప్పే మాటలే నేరాన్ని రుజువు చేస్తాయి అని తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: