జంతువులకు లేని ఎన్నో తెలివితేటలు మనుషులకు ఉన్నాయి. అందుకే మనిషిని జ్ఞాని అన్నారు. మనుషులకు బంధాలు ఉంటాయి, వాటితో పాటు ఎన్నో బాధ్యతలు కూడా ఉంటాయి. బాద్యతలు ఉన్న చోట భావాలు కూడా ఎక్కువే. అందుకే మనకు ప్రేమ, జాలి, కరుణ, దయ, స్నేహం  వీటితో పాటు కోపం, ద్వేషం, అసూయ అన్న నెగిటివ్ భావాలు కూడా మనలో ఉంటాయి.  వీటినే  భావోద్వేగాలు అని కూడా పిలుస్తారు. సందర్భాన్ని బట్టి అవి బయటపడుతుంటాయి. ఇదే భావాలు జంతువుల్లో కూడా ఉంటాయి. అయితే మనకు వాటికి కాస్త తేడా ఉంటుంది. ఎదుటి మనిషిని బాధించకుండా కంట్రోల్ చేసుకోగలం. 

కానీ చాలామంది ఈ విషయాన్ని విస్మరించి ఎదుటి వారిపై విరుచుకుపడుతుంటారు. చిన్న చిన్న విషయాలకు కూడా సర్దుకోలేక ఇతరులపై తమ కోపాన్ని ద్వేషాన్ని అసూయని చూపిస్తుంటారు. చాలా సునాయాసంగా ఇతరులను తమ మాటలతో బాధిస్తుంటారు. దాని వల్ల బంధాలు తెగిపోతాయి, బాంధవ్యాలు కనుమరుగై పోతాయి. ఒక్కసారి పెదవి నుండి మాట జారితే దాన్ని వెనక్కి తీసుకోవటం అసాధ్యం. అందుకే మన కోపాన్ని కానీ, అసహనాన్ని కానీ వ్యక్తపరిచే ముందు కాస్త ఆలోచించాలి. అలా కాకుండా అనాలోచితంగా... అజ్ఞానిలా ఇతరులను బాధపెడితే అంతకన్నా అంధకారం మరొకటి ఉండదు. 

బాంధవ్యాలు ఎంతో విలువైనవి... మన వైఖరితో వాటిని దూరం చేసుకోక ముందే.. వాటి విలువను తెలుసుకొని నడుచుకోవడం ఉత్తమం. మనుషుల మధ్య విభేదాలు వస్తే అవి ఏదో ఒకరోజు తొలగిపోయి మళ్లీ కలిసి పోవచ్చు.. అదే మనసుల మధ్య విభేదాలు వస్తే కలవడం కష్టం.  మనకు నచ్చని విషయాన్ని వ్యక్తపరచడం తప్పని చెప్పలేము కానీ... దాన్ని వ్యక్తపరిచే సమయంలో ఎదుటివారి మనసును మాత్రం అసలు గాయపరచకూడదు. ఎప్పుడూ కూడా ఎదుటి వారి బాధ పాడడం వలన మీరు సంతోషంగా ఉంటారు అంటే అది ఎంత మాత్రం మంచిది కాదని తెలుసుకోండి.

మరింత సమాచారం తెలుసుకోండి: