మహిళల్లో ఉండే టాలెంట్ కరెక్ట్ సమయంలో బయట పడితే వారికి ఎంతగానో పేరు ప్రఖ్యాతను తీసుకు వస్తుంది. అనాదికాలం నుంచి మహిళలు తమ టాలెంట్ను గుర్తించలేక మరుగున పడి పోయారు. కానీ ఈ తరంలో మహిళలు తమ టాలెంట్ను గుర్తించి ప్రపంచానికి తెలియజేయడం ఎంతో విజయవంతమయ్యారు. అలా బొమ్మలు గీయడంలో మహిళలు తమ ప్రత్యేకతను చాటుకుంటున్నారు.  కాకతీయులు, విజయనగర రాజులు, పూర్వకాలంలో ప్రజల మెప్పు పొందిన ఎన్నో ఘనతలు మహిళలు ఈ కళలో సాధించారు.

ఈ కలను కొనసాగిస్తున్న కళాకారులలో అనాదికాలం నుంచి మహిళల పాత్ర మరువలేనిది. 35 ఏళ్లుగా తన జీవితాన్ని అంకితం చేస్తూ ఈ కళ్ళతో ముందుకు నడిపిస్తున్న ధనాల కోట వనజ గురించి ఇప్పుడు మనం చెప్పుకోవాలి. మా తాతయ్యలు బొమ్మలు చేస్తారని విన్న, పెద్దగా తెలియదు. మా ఆయన బొమ్మలు బాగా తీస్తారని పెళ్లికి ముందే తెలుసు. సిద్దిపేట జిల్లాలోని చేర్యాల కు కాపురానికి వచ్చిన ఈ కళ అంత కొత్తగా వింతగా ఉండేది. పెయింటింగ్స్ బాగా వేసే దాన్ని. ముగ్గురు పిల్లలను చూసుకుంటూ నా వంట పనులు పూర్తయ్యాక మా ఆయన బొమ్మలు గీయడం నేర్పించేవారు.

ఆసక్తి ఉండడంతో రెండేళ్లకే ఈ కళ మీద పూర్తి అవగాహన వచ్చింది. బొమ్మ వేసి చూసుకుంటే ఆశ్చర్యపోయే దాన్ని. బుడబుక్కల వాళ్ళ దగ్గర నుంచి పద్మశాలీల వరకు మా ఇంటికి వచ్చేవారు. మా ఇంట్లోనే ఉంది కుల పురాణాలు చెప్పే వారు. మహాభారతం, రామాయణం, శివ పురాణం మార్కండేయ పురాణం ఇలా ముఖ్యమైన ఘట్టాలు చెబుతుంటే .మేం చక చక బొమ్మలు గీసేవాల్లం. నాకైతే మా వారు సంవత్సరం శిక్షణ ఇచ్చారు. మేము బొమ్మలు వేస్తున్నం కాబట్టి బొమ్మలోల్లు అని మా ఊర్లో పిలిచేవాళ్ళు. ఈ కళను ప్రోత్సహించాలి అనే ఆలోచనతో ప్రభుత్వం 1992 లో శిక్షణ తరగతులు ఏర్పాటు చేయమని కోరింది. ప్రభుత్వ సహకారంతో ఆసక్తి ఉన్నవారికి ఈ కళను నేర్పించాము. 

మరింత సమాచారం తెలుసుకోండి: