చర్మం అందమైన మెరిసే మంచి నిగారింపును సంతరించుకోవాలంటే ఖచ్చితంగా కొన్ని సూపర్ ఫుడ్స్ తీసుకోవాలి. ఈ సూపర్ ఫుడ్స్ చర్మాన్ని చాలా అందంగా ఇంకా అలాగే యవ్వనంగా ఉంచుతాయి. ఇక అంతేకాదు మీ చర్మానికి మంచి నిగారింపుని కూడా ఇస్తాయి.అందువల్ల మీరు నిత్య యవ్వనంగా కనిపిస్తారు. మరి ఆ సహాజసిద్ధమైన  సూపర్ ఫుడ్స్ ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.టొమాటోను మనం ఎప్పుడు కూడా ఆహారంలో తీసుకుంటాం.ఈ టొమాటోలో లైకోపిన్, విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇవి రెండూ కూడా శరీరంలోని వేడిని నయం చేయడంలో సహాయపడే పోషకాలు. ఇంకా అంతేకాదు వీటిలో యాంటీఆక్సిడెంట్లు కూడా ఉంటాయి.ఇవి అందమైన ఆరోగ్యకరమైన చర్మానికి అద్బుతమైన సప్లిమెంట్‎గా పనిచేస్తాయి. ఈ టొమాటోను పచ్చిగా కానీ,స్టైర్ ఫ్రైస్‎లో కానీ, సాస్‎ల రూపంలో కానీ మీరు తీసుకోవచ్చు.ఇంకా అలాగే యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రయోజనాలను అందించే సహాజ ఆహారాల్లో వెల్లుల్లి ఒకటి. ఇది ఆక్సీకరణ ఒత్తిడిని కూడా చాలా ఈజీగా తగ్గిస్తుంది. అలాగే ఇది ఫ్రీరాడికల్స్ తో కూడా పోరాడుతుంది.


మీ ఆహారంలో తరచుగా వెల్లుల్లిని చేర్చుకుంటే ఖచ్చితంగా చాలా మంచి ఫలితం ఉంటుంది.ఆకుకూరలు..బచ్చలికూర, పాలకూర ఇంకా తోటకూర ఇలా ఏదైన కావచ్చు. ఇందులో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఎక్కువగా ఉంటాయి. అవి శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్‎గా కూడా పనిచేస్తాయి. ఇంకా అంతేకాదు లిఫీ గ్రీన్స్‎లో విటమిన్ సి కూడా చాలా పుష్కలంగా లభిస్తుంది. అందుకే ఈ ఆకుకూరలను తరచుగా మీ ఆహారంలో భాగం చేసుకోండి. వారానికి రెండు సార్లు ఈ ఆకుకూరలను తీసుకున్నట్లయితే ఖచ్చితంగా మీ చర్మ ఆరోగ్యంలో తేడా గమనించవచ్చు.ఇంకా అలాగే గింజలు అత్యంత పోషక విలువలు కలిగిన ఆహారాలలో ఒకటి. ఎందుకంటే వీటిలో యాంటీ ఇన్ఫ్లమేటరీ సమ్మేళనాలను కూడా కలిగి ఉన్నాయని పలు పరిశోధనల్లో వెల్లడైంది. బాదం, వాల్‌నట్‌లు, జీడిపప్పు, గుమ్మడికాయ గింజలు, పొద్దుతిరుగుడు విత్తనాలు ఇంకా అలాగే నువ్వులు వంటివి చర్మ సంరక్షణకు చాలా ప్రయోజనకరంగా ఉంటాయి.అందుకే వీటిని ఎక్కువగా ఆహారంలో చేర్చుకునే ప్రయత్నం చేయండి.

మరింత సమాచారం తెలుసుకోండి: