జమ్మూ కాశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్ నాయకుడు ఫరూక్ అబ్దుల్లా కేంద్ర భూభాగమైన జమ్మూ కాశ్మీర్ లో ఎటువంటి పురోగతి లేదని చేసిన వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి రామ్ దాస్ అధావలె కొట్టిపారేశారు. శాంతి కోసం భారత  ప్రభుత్వ ప్రయత్నాలను పాకిస్తాన్ ఎప్పుడూ మోసం చేస్తూనే ఉందని అన్నారు. "భారతదేశం ఎప్పుడూ కూడా చర్చలు, అలాగే శాంతికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుందని చెప్పారు.

కాని పాక్ మాత్రం ఎప్పుడు మోసం చేస్తూనే ఉందని అన్నారు. మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి చర్చలు ప్రారంభించినట్లు ఆయన గుర్తుంచుకోవాలి. పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ కూడా భారతదేశానికి వచ్చారు అని ఆయన పేర్కొన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ 2014 లో ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాకిస్తాన్ తో చర్చల ద్వారా ముందుకు  వెళ్తామని చెప్పారని కేంద్ర మంత్రి గుర్తు చేసారు.

మరింత సమాచారం తెలుసుకోండి: