న‌ల్ల‌గొండ జిల్లాలో బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు బండి సంజ‌య్ టూర్‌కు అనుమ‌తి లేద‌ని పోలీసులు పేర్కొన్నారు. ఎన్నిక‌ల కోడ్ నేప‌థ్యంలో అనుమ‌తి లేకుండా ప‌ర్య‌టించ‌డం స‌రికాద‌ని.. ప‌ర్య‌ట‌న‌లో బీజేపీ, టీఆర్ఎస్ కార్య‌క‌ర్త‌ల ప‌ర‌స్ప‌ర దాడిలో పోలీసులు సైతం గాయ‌ప‌డ్డారు. దీంతో అనుమ‌తి లేకుండా ప‌ర్య‌టించిన బండి సంజ‌య్‌, ప‌లువురు బీజేపీ నేత‌ల‌పై కేసులు న‌మోదు చేసారు పోలీసులు.

 చివరి నిమిషంలో బండి సంజయ్ నల్లగొండ జిల్లాలోకి ప్రవేశించిన తర్వాత అనుమతి కోసం  లేఖ ఇచ్చారని నల్గొండ ఎస్పీ రంగనాథ్ వెల్ల‌డించారు. అందుబాటులో ఉన్న సిబ్బందితోనే భ‌ద్ర‌తా చ‌ర్య‌లు చేప‌ట్టాం. అనుమ‌తి లేని కార‌ణంగా  ప‌ర్య‌టించ‌డంతో స‌రైన భ‌ద్ర‌త క‌ల్పించ‌లేక‌పోయాం. కొంద‌రూ బండి సంజ‌య్ కాన్వాయిపై రాళ్లు, కోడిగుడ్లు వేస్తున్నార‌నే స‌మాచారంతో అప్ప‌టిక‌ప్పుడు సిబ్బందితో ప‌రిస్థితికి అనుగుణంగా చ‌ర్య‌లు తీసుకున్నాం అని పేర్కొన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఉల్లంఘించినందుకు నల్లగొండ రూరల్, మాడగులపల్లి, వేములపల్లి పోలీసు స్టేషన్  ప‌రిధిల‌లో బండి సంజ‌య్‌పై కేసు నమోదు చేసిన‌ట్టు ఎస్పీ రంగ‌నాథ్ వెల్ల‌డించారు.  



మరింత సమాచారం తెలుసుకోండి: