ప్రభుత్వం ప్రకటించిన పీఆర్సీకి వ్యతిరేకంగా ఉద్యోగస్తుల ఆందోళనలు ఉధృతం అవుతున్నాయి. ఇవాళ్టి నుంచి నిరసన ప్రదర్శనలు ఉంటాయని నిన్న ఉద్యోగ సంఘాలు ప్రకటించాయి. ఇవాళ కలెక్టరేట్ల ముట్టడికి పిలుపు ఇచ్చాయి. దీంతో పోలీసులు అప్రమత్తం అయ్యారు. జిల్లాల్లో ఎక్కడికక్కడ నిరసన ప్రదర్శనలను అడ్డుకుంటున్నారు. ఉద్యోగ సంఘాల నాయకులను ముందస్తుగా అరెస్టు చేస్తున్నారు.

పీఆర్సీకి వ్యతిరేకంగా కలెక్టరేట్ ముట్టడికి పిలుపునిచ్చిన ఉపాధ్యాయులను కూడా పోలీసులు ముందస్తుగా అరెస్టు చేస్తున్నారు. కడప జిల్లాలో యుటిఎఫ్ రాష్ట్రకార్యదర్శి లక్ష్మీ రాజాను అర్ధరాత్రి దాటిన తర్వాత ముందస్తుగా అరెస్ట్ చేశారు. నెల్లూరు జిల్లాలో  వెంకటగిరి పోలీస్ స్టేషన్ వద్ద ఉపాధ్యాయులు నిరసన తెలిపారు. అక్రమ అరెస్టులు చేయడం సరికాదంటూ ఉపాధ్యాయులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. గుంటూరు కలెక్టరేట్ ముట్టడికి ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక సంఘాల పిలుపు ఇచ్చాయి. మెరుగైన పీఆర్సీ లక్ష్యంగా ఉద్యోగ సంఘాల నిరసన కార్యక్రమాలు చేపడుతున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి:

PRC