కేంద్ర మంత్రి కపిల్ పాటిల్‌ పాకిస్తాన్‌కు అదిరిపోయే హెచ్చరిక చేశారు. ప్రధాని మోడీ నాయకత్వంలో 2024లోగా పాక్ ఆక్రమిత కాశ్మీర్‌ను తిరిగి స్వాధీనం చేసుకుంటామని చెప్పారు. ప్రధాని నరేంద్ర మోడీ దీని కోసం బాగా కృషి చేస్తున్నారని కేంద్ర మంత్రి కపిల్ పాటిక్ అంటున్నారు. గతంలో మోడీ అమిత్‌ షాలు అసాధ్యం అనుకున్ని సుసాధ్యం చేసి చూపించారని కేంద్ర మంత్రి కపిల్ పాటిల్ అంటున్నారు.

సీఏఏ చట్టం, ఆర్టికల్ 370 రద్దు వంటి సాహసోపేతమైన నిర్ణయాలు వేరే ఇతర నాయకులైతే తీసుకుని ఉండేవారు కాదని కేంద్ర మంత్రి కపిల్ పాటిల్ కుండబద్దలు కొట్టారు. నిజంగానే మోడీ సర్కారు పాక్ ఆక్రమిత కాశ్మీర్‌ను స్వాధీనం చేసుకుంటుందా..అంటే అది అంత సులభమైన వ్యవహారం కానే కాదు. మాటలు చెప్పినంత సులభం కాదు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో లబ్ది కోసమే కేంద్ర మంత్రి ఇలా మాట్లాడి ఉండొచ్చన్న వాదన వినిపిస్తోంది. చూద్దాం ఏం జరుగుతుందో..?


మరింత సమాచారం తెలుసుకోండి: