ఏపీ సీఎం జగన్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. నవరత్నాల్లో ఒకటైన సున్నా వడ్డీ పథకం కొనసాగించాలని నిర్ణయించారు. ఈ ఏప్రిల్‌ 22న సీఎం జగన్ సున్నా వడ్డీ పథకం నగదు విడుదల చేస్తారని మంత్రి పేర్ని నాని తెలిపారు. డ్వాక్రా మహిళల రుణంపై వడ్డీని వెనక్కి చెల్లించే ఈ కార్యక్రమం కొనసాగుతుదని మంత్రి పేర్ని నాని తెలిపారు. ఈసారి 98 లక్షల మంది డ్వాక్రా మహిళలు రుణాలు తీసుకున్నారని.. బ్యాంకుల నుంచి అదనంగా రూ.4 వేల కోట్లు రుణం తీసుకున్నారని మంత్రి పేర్ని నాని వివరించారు. ఈనెల 22న మహిళల ఖాతాల్లో సీఎం జగన్ 1250 కోట్లు విడుదల చేయబోతున్నారన్నమాట. వైయ‌స్సార్ సున్నా వడ్డీ పథకంతో పాటు మిల్లెట్ మిషన్ పాలసీకి కూడా కేబినెట్‌ ఆమోదం తెలిపింది. కొత్తపేట, పులివెందుల రెవెన్యూ డివిజన్లకు కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది.

మరింత సమాచారం తెలుసుకోండి: