వీఐపీ ప్రోటోకాల్ నెపంతో దేవాలయాల్లో సాధారణ భక్తులకు ఇబ్బంది కలిగించొద్దని డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ ఆదేశించారు. వేసవిలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులూ లేకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించిన డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ.. సింహాచంలోలో మే 3 తేదీన జరిగే చందనోత్సవ వేడుకలకు ముందస్తుగానే సన్నాహాలు మొదలు పెట్టాలని సూచించారు. దేవాలయాలన్నిటిలోనూ సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి భద్రతను పటిష్టం చేయాలని మంత్రి కొట్టు సత్యనారాయణ ఆదేశాలు ఇచ్చారు. దేవాలయ ప్రాంగణానికి సమీపంలో ఉన్న తినుబండారాలు, వస్తువులను అధిక ధరలకు విక్రయించే విధానంపై కఠినంగా వ్యవహరించాలని మంత్రి కొట్టు సత్యనారాయణ ఆదేశించారు. బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, పర్యాటక ప్రాంతాల్లో ప్రముఖ దేవాలయాల హోర్డింగ్ లు ఏర్పాటు చేయాలని డిప్యూటీ సీఎం, దేవాదాయశాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ వివరించారు. మరి ఆదేశాలు బాగానే ఉన్నాయి. అమలులో ఎంత వరకూ నిక్కచ్చిగా ఉంటారో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: