గోదావరి మహోగ్రరూపం దాల్చడంతో నదీపరీవాహ ప్రాంత వాసులకు తీవ్ర ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ప్రత్యేకించి కోనసీమ జిల్లాలోని పల్లెలు ముంపునకు గురవుతున్నాయి. కోససీమ జిల్లాపై గోదావరి వరద తీవ్ర ప్రభావం తీవ్రంగా ఉండటంతో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. మొత్తం కోనసీమ జిల్లాలోని 14 మండలాలపై వరద ప్రభావం తీవ్రంగా ఉన్నట్టు అధికారులు అంచనా వేస్తున్నారు.


కోనసీమ జిల్లాలోని పి.గన్నవరం మండలం బూరుగులంక, ఊడిమూడిలంక, అరిగెలవారిపేట, పెదపూడిలంక వంటి లంకలు పూర్తిగా  జల దిగ్భందం అయ్యాయి. ఈ గ్రామాల్లో పడవలపైనే ప్రయాణం చేయాల్సి వస్తోంది. అలాగే... పశ్చిమ గోదావరి జిల్లా పరిధిలోని ఆచంట, యలమంచిలి
మండలాల పరిధిలోని పెదమల్లంలంక, అయోధ్య లంక, ఆనగారి లంక, కననకాయ లంకలకు కూడా గోదావరి ఉగ్రరూపం కారణంగా రాకపోకలు బంద్ అయ్యాయి. ఈ గోదావరి వరద తగ్గేంత వరకూ ఈ లంక గ్రామాల ప్రజలు అరచేతిలో ప్రాణాలు పెట్టుకుని బతకాల్సిందే.  

మరింత సమాచారం తెలుసుకోండి: