ఉద్యోగాల పేరుతో సైబర్ నేరాలు పెరుగుతున్నాయి. కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ పేరుతో  ఉద్యోగాల రిక్రూట్‌మెంట్‌ చేపడుతున్నట్టు సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని నమ్మొద్దని  ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమీషనర్  చెబుతున్నారు. ఉద్యోగాల నియామకానికి ఎం.డి, నేషనల్ హెల్త్ మిషన్ ఏపీ తరఫున ఎటువంటి నోటిఫికేషనూ ఇవ్వలేదని నేషనల్ హెల్త్ మిషన్ డైరెక్టర్  జె.నివాస్ స్పష్టం చేశారు.


ఇలాంటి తప్పుడు ప్రచారాన్ని నమ్మి నిరుద్యోగులు మోసాలకు గురి కావొద్దని నేషనల్ హెల్త్ మిషన్ డైరెక్టర్  జె.నివాస్ స్పష్టంచేశారు.  సూచించారు. ఆయుష్మాన్ భారత్ , ఎంఎల్ హెచ్ పి , మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్, ఫార్మాసిస్ట్ పోస్టులకు ఏపీలో  నియామకాలు చేపడుతున్నట్టు కొందరు ఫేక్ లెట‌ర్లను తయారు చేశారు. ఆ  ఫేక్ లెటర్లు తయారు చేసి సోషల్ మీడియాలో  వైరల్ చేస్తున్నారు.  వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని నివాస్ అన్నారు. ఏపీ వైద్య ఆరోగ్య శాఖలో ఎలాంటి రిక్రూట్మెంట్ చేపట్టినా నోటిఫికేషన్ ద్వారా తెలియజేస్తామని నివాస్ అన్నారు. సోషల్ మీడియాలో  వచ్చే ఫేక్ లెటర్లను చూసి మోసపోవద్దని నివాస్ హెచ్చరించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: