తెలంగాణలో రైతుల ఆత్మహత్యలు పెరుగుతున్నాయని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ ఆరోపించారు. తెలంగాణలో 100 మందిలో 91 మంది రైతులు అప్పుల పాలయ్యారని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ విమర్శించారు. తెలంగాణలో ఫసల్ భీమా యోజన ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించిన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్.. తెలంగాణ రైతుల ఆత్మహత్యలలో దేశంలోనే నాలుగో స్థానం లో ఉందని గుర్తుచేశారు.

తెలంగాణలో లక్ష రూపాయల రుణ మాఫీ ఎందుకు చేయలేకపోయారన్న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్.. రైతు భీమా.. కౌలు రైతులకు ఎందుకు ఇవ్వరని ప్రశ్నించారు. పెద్ద పెద్ద వాగ్దానాలు ఇస్తున్నారు తప్ప వాటిని నెరవేర్చడం లేదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ ఎద్దేవా చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు వ్యయాన్ని లక్ష 20 వేల కోట్లకు పెంచారని..   ప్రాజెక్టుల వ్యయం ఇష్టమొచ్చినట్లుగా పెంచుతున్నారని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ విమర్శించారు. మన ఊరు మన బడి కేంద్ర పథకం అయితే దాన్ని రాష్ట్ర స్కీమ్ గా క్లెయిమ్ చేసుకుంటున్నారని.. ప్రజలకు వాస్తవాలు అర్థం అవుతాయనే ఆయుష్మాన్ భారత్ లో చేరడం లేదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ అన్నారు.  


మరింత సమాచారం తెలుసుకోండి: