రాష్ట్ర చరిత్రలో బీసీలకు ఎస్సీ ఎస్టీ మైనార్టీ వర్గాలకు న్యాయం జరిగిందంటే అది ఒక్క వైయస్ జగన్మోహన్ రెడ్డి వల్లేనని రాష్ట్ర పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు అన్నారు. మంత్రి కారుమూరి నాగేశ్వరరావు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై తీవ్ర విమర్శలు చేశారు. వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో అన్ని వర్గాలకు మేలు జరుగుతుంటే... చంద్రబాబు నాయుడు చూసి ఓర్వలేక లేనిపోని వ్యాఖ్యలు చేస్తున్నారని మంత్రి కారుమూరి నాగేశ్వరరావు విమర్శించారు.

టీడీపీ హయాంలో ఏ ఒక్క వర్గం ప్రజలకైనా మేలు జరిగిందా అని  మంత్రి కారుమూరి నాగేశ్వరరావు ప్రశ్నించారు. మాట వస్తే 40 ఏళ్ల రాజకీయ చరిత్ర అని చెప్పుకుంటున్న చంద్రబాబు... బీసీలకు ఎస్సీ, ఎస్టీ మైనార్టీ వర్గాలకు మహిళలకు రైతులకు ఏం చేశారో బహిరంగంగా చెప్పాలని మంత్రి కారుమూరి నాగేశ్వరరావు సవాల్ విసిరారు. రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకునే ప్రయత్నాలు మానుకొని ప్రజాసంక్షేమం కోసం ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలకు సహకరించాలని మంత్రి కారుమూరి నాగేశ్వరరావు తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: