సౌదీ అరేబియా పాకిస్తాన్‌కు షాక్ ఇచ్చింది. సౌదీ ప్రధానమంత్రి మహ్మద్ బిన్ సల్మాన్.. తన పాకిస్థాన్ పర్యటనను అనూహ్యంగా రద్దు చేసుకున్నారు. పాక్ లో మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ లాంగ్ మార్చ్ నేపథ్యంలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. అందుకే సౌదీ క్రౌన్ ప్రిన్స్ ఈ పర్యటనను రద్దు చేసుకున్నారు. అయితే.. సల్మాన్ పాక్ పర్యటన కోసం పాకిస్థాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నా.. ఆయనకు నిరాశ తప్పడం లేదు.


ప్రస్తుతం పాకిస్తాన్ దివాలా అంచున ఉంది. సౌదీ ప్రధాని పర్యటనలో పాక్ 4 బిలియన్ డాలర్ల కొత్త రుణాన్ని ఇచ్చే ప్రకటన చేస్తారని పాక్ ప్రధాని ఆశించతారు. గత నెలలో పాక్  ప్రధాని షహబాజ్ షరీఫ్ సౌదీ అరేబియా పర్యటనకు వెళ్లిన సమయంలో కూడా పాకిస్థాన్ కు సౌదీ అరేబియా ప్రభుత్వం ఎలాంటి ఆర్థిక సహాయం ప్రకటించలేదు. అంతే కాదు.. యువరాజు సల్మాన్ నవంబర్ నెలాఖరున ఇస్లామాబాద్  పర్యటనలో ఆర్థిక సాయం ప్రకటిస్తారని ఆశించారు. అది కూడా రద్దయింది. సౌదీ ప్రిన్స్  పర్యటన రద్దుపై పాక్ విదేశాంగ మంత్రిత్వ శాఖ మాత్రం నోరు విప్పడం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: