ఇటీవల అమర్‌రాజా బ్యాటరీ సంస్థ తెలంగాణలో భారీగా పెట్టుబడులకు ముందుక వచ్చిన సంగతి తెలిసిందే. దీంతో ఇదో వివాదంగా మారింది. జగన్ సర్కారు వైఖరి వల్లే ఏపీ నుంచి పరిశ్రమలు వెళ్లిపోతున్నాయని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. దీనిపై నారా లోకేశ్ మరోసారి స్పందించారు. అమర్ రాజా ను కాలుష్యం కారణంగా తానే పంపించేశా అన్న సజ్జల చెబుతున్నారని.. నారా లోకేశ్ మండిపడ్డారు. అసలు కాలుష్యం కారణంగా మూయాల్సి వస్తే తొలుత భారతీ సిమెంట్ మూయాలని నారా లోకేశ్‌ డిమాండ్ చేశారు.


జగన్ బటన్ నొక్కితే చెత్తపన్ను పడిందని.. నిత్యావసరాలు, విద్యుత్ బిల్లులు, పన్నులు పెరిగాయని నారా లోకేష్ ద్వజమెత్తారు. జగన్ రెడ్డి బటన్ నొక్కితే సంక్షేమ పథకాలు అన్నీ గోవిందా గోవిందా అని  నారా లోకేశ్  ఎద్దేవా చేసారు. రహస్య జీవోల ద్వారా ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులను పీకేస్తున్నారని  నారా లోకేశ్  అన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: