తెలంగాణ వచ్చాక అంతా మారిపోయింది.. రైతుల కష్టాలు తీరిపోయాయి.. పంటలు విపరీతంగా పండుతున్నాయి.. ఇదీ టీఆర్ఎస్ నేతలు తరచూ చెప్పే మాటలు అయితే.. తెలంగాణ వచ్చాక వ్యవసాయ పంప్‌సెట్ల సంఖ్య 30లక్షలకు పెరిగింది కదా మరి దాని సంగతి ఏంటని ప్రశ్నిస్తున్నారు పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి. మరి ఈ లెక్కలు చూస్తే.. ప్రాజెక్టుల ద్వారా నీళ్లు ఎక్కడిస్తున్నారని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.


రాష్ట్రంలో 88 వేల మంది రైతులు అధికారిక లెక్కల ప్రకారమే చనిపోయారని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి వివరించారు. గిట్టుబాటు ధర, పంట పరిహారం ఉండి ఉంటే ఇంతమంది చనిపోయేవారా అని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. సర్కార్‌ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే బీఆర్‌ఎస్‌ అంటూ కొత్త నాటకానికి కేసీఆర్‌ తెరలేపారని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి విమర్శించారు. దిల్లీ మద్యం కుంభకోణంలో నిందితులను కఠినంగా విచారించిన సీబీఐ.. ఎమ్మెల్సీ కవిత విషయంలో మాత్రం ఎందుకు మోకరిల్లుతోందని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

kcr