ఏపీ కేబినెట్ సమావేశం తర్వాత తెరవెనుక ఏం జరిగిందో.. లీకులు బయటకొచ్చాయి. ప్రభుత్వం నవరత్నాల పేరుతో సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతోంది. వీటన్నిటికీ జగనన్న అన్న పేరు ఉండటంతో.. ప్రజలందరూ జగన్ ఒక్కడే అన్ని చేస్తున్నారని ఫీల్ అవుతున్నారు. ప్రజాప్రతినిధులకు సంబంధం లేదని అనుకుంటున్నారు. వాలంటీర్లకు ఉన్న గుర్తింపు కార్యకర్తలు, ప్రజాప్రతినిధులకు లేకుండా పోయింది. దీంతో జగన్ అలర్టయ్యారు.

ప్రజలతో మమేకంకండి అని మంత్రులు, ఎమ్మెల్యేలకు సూచించారు. ట్యాబ్ లు, పెరిగిన పెన్షన్ డబ్బులు ప్రజాప్రతినిధుల చేతుల మీదుగా ఇప్పిస్తున్నారు. ప్రజల్లో తమకు ఉన్న నెగెటివిటీని పోగొట్టుకోవాలని సూచించారు. అన్ని కార్యక్రమాల్లో పాల్గొంటేనే ప్రజలకు దగ్గరవుతారని తెలిపినట్లు సమాచారం. ఇవన్నీ పథకాలు తాము చెప్తేనే.. వస్తున్నట్లుగా ప్రజలకు అర్థమయ్యేలా చెప్పాలని అన్నారు. ఇదంతా జరిగితేనే.. వచ్చే ఎన్నికల్లో గెలుస్తామన్నారు. ఒక్కరితోనే అధికారం రాదని జగన్ కు అర్థమైనట్లుంది. ఇన్ని రోజులుగా లేనిది ఇప్పుడు కాస్త జగన్ వెనక్కి తగ్గినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: