హైదరాబాద్ పోలీసులు మరో హెటెక్ వ్యభిచారం రాకెట్ గుట్టు రట్టు చేశారు. మానవ అక్రమ రవాణా కేసులో మరో 7గురిని అరెస్ట్ చేశారు. ఆన్ లైన్ లో వ్యభిచారం నిర్వహిస్తున్న ముఠాను పట్టుకున్నారు. ముంబయి, బెంగాల్ , ఏపీకి చెందిన యువతులతో వ్యభిచారం చేయిస్తున్న ముఠాను పట్టుకున్నారు. ఇప్పటి వరకు ఈ ముఠా దాదాపు 850మంది యువతులను వ్యభిచార రొంపిలోకి దింపింది. లోకాంటో వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ వ్యభిచారం నిర్వహిస్తున్నారు.

ఈ వెబ్‌ సైట్‌లో అందమైన యువతుల ఫోటోలను ఆన్ లైన్ లో ఉంచి విటులను ఆకర్షిస్తున్నారు. వ్యభిచార గృహాలకు విటులను రప్పించి ముఠా డబ్బులు వసూలు చేస్తోంది. విటుల నుంచి వసూలు చేసిన డబ్బులు కొంత నగదు మాత్రమే యువతులకు ఇస్తున్న నిర్వాహకులు.. మిగతాది తమ ఖాతాలో వేసుకుంటున్నారు. ఇలాంటి మానవ అక్రమ రవాణా గురించి 9490617444 వాట్సాప్ నకు సమాచారం ఇవ్వాలని సైబరాబాద్ పోలీసులు కోరుతున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: