ప్రపంచంలోనే అతిపెద్ద నదీ క్రూయిజ్‌ను ప్రధాని మోదీ ఈనెల 13న ప్రారంభించబోతున్నారు. కాశీలోని గంగావిలాస్‌ క్రూయిజ్‌ ను జనవరి 13 ప్రధాని మోదీ వర్చువల్‌గా ప్రారంభించనున్నారు. ఈ గంగావిలాస్‌ క్రూయిజ్‌ తో కాశీతో పాటు అనేక ప్రాంతాల్లో పర్యాటకానికి ఊతమిస్తుందని భావిస్తున్నారు. గంగావిలాస్‌ క్రూయిజ్‌ తో భారత్‌, బంగ్లాదేశ్‌లలో 27నదులపై విహరించవచ్చు. మొత్తం 4వేల కిలోమీటర్ల సుదీర్ఘ ప్రయాణాన్ని ఈ గంగావిలాస్‌ క్రూయిజ్‌ తో 50 రోజుల్లో చుట్టేయవచ్చు.

ఈ గంగావిలాస్‌ క్రూయిజ్‌ ప్రయాణంలో మార్గమధ్యంలో అనేక పర్యాటక ప్రాంతాలు సందర్శించొచ్చు. సుందర్బన్‌ అడవులు, కజిరంగా నేషనల్‌ పార్కులు సందర్శించుకోవచ్చు. అనేక అభయారణ్యాలు, ప్రపంచ వారసత్వ ప్రదేశాలను ఈ గంగావిలాస్‌ క్రూయిజ్‌ పర్యటనలో తిలకించే వీలు ఉంది.  ఈ అతిపెద్ద నదీ క్రూయిజ్‌ ద్వారా ప్రధాని నరేంద్ర మోదీకి కాశీ పట్టణం, గంగా నదులతో అనిర్వచనీయ బంధం రెట్టింపు కానుందని చెప్పొచ్చు. ఈ గంగా విలాస్‌ క్రూయిజ్‌  భారత్‌, బంగ్లాదేశ్‌లలో మొత్తం 27నదుల మీద ప్రయాణం చేసి పర్యాటకానికి కొత్త అందాలు తీసుకురానుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: