ఏపీ లో హైకోర్టు మరోసారి సీఎం జగన్ కు షాక్ ఇచ్చింది. సలహాదారుల నియామకం పిటీషన్ విచారణలో  ఏపీ హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది.  సలహాదారుల నియామకానికి సంబంధించిన రాజ్యాంగ బద్ధతను తేలుస్తామని ఏపీ హైకోర్టు స్పష్టం చేసింది. ఇలా సలహాదారులను   నియమించుకుంటూ పోతే సంఖ్యకు పరిమితం ఏమీ ఉండదని ఏపీ హైకోర్టు స్పష్టం చేసింది. అంతే కాదు.. ఏపీ హైకోర్టు కొన్ని కామెంట్లు చేసింది.

అసలు బయట నుంచి నియమితులైన వ్యక్తులు జవాబుదారీతనంతో ఎలా ఉంటారని ఏపీ ప్రభుత్వాన్ని నిలదీసింది. ఇలా బయటి నుంచి నియమితులయ్యే వారికి ప్రవర్తనా నియమావళి లేదని ఏపీ హైకోర్టు స్పష్టం చేసింది. మరి అలాంటి వారి ద్వారా ప్రభుత్వంలోని సున్నిత సమాచారం బయటకు వెళ్లే అవకాశం ఉంటుందని ఏపీ హైకోర్టు అభిప్రాయపడింది. ఈ కేసు విచారణను ఏపీ హైకోర్టు ఈ నెల 28కు వాయిదా వేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: