కడప ఎంపీ అవినాష్ రెడ్డి ఢిల్లీలో కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వనీ వైష్ణవ్ ను, పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డిని వేరువేరుగా కలిశారు. కడప- బెంగళూరు మధ్య రైలు మార్గాన్ని నిర్మించడానికి కొత్త అలైన్మెంట్ కు ఆమోదం తెలపాలని కడప ఎంపీ అవినాష్ రెడ్డి రైల్వే మంత్రిని కోరారు. కొత్త అలైన్మెంట్ ద్వారా రెండు రాష్ట్రాలకు భూసేకరణ సమస్య, ఖర్చు భారీగా తగ్గుతుందని కడప ఎంపీ అవినాష్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.


2021 జోన్ లో ఇదే సమస్యపై రైల్వే బోర్డు చైర్మన్ త్రిపాటి దృష్టికి తీసుకెళ్లినట్లు విన్నవించిన అవినాష్ రెడ్డి.. పర్యాటక ప్రాంతమైన గండికోట అభివృద్ధికి కేంద్రం తరఫున చర్యలు తీసుకోవాలని  పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డిని కోరారు. స్వదేశీ దర్శన్ పథకం కింద గండికోట అభివృద్ధికి 70 నుంచి 80 కోట్లు మంజూరు చేస్తామని మంత్రి కిషన్‌ రెడ్డి హామీ ఇచ్చినట్టు తెలిసింది. మరి ఈ వరాలు ఎప్పటికి దక్కుతాయో?

మరింత సమాచారం తెలుసుకోండి: