స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్‌లో అవినీతి విషయంపై మళ్లీ విచారణ ఊపందుకోనుందని.. ఈసారి పెద్దల అరెస్టులు తప్పవని ఏపీ సర్కారు అనుకూల మీడియాలో కథనాలు వస్తున్నాయి. అయితే.. దీనిపై ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మాజీ ఎండీ అర్జా శ్రీకాంత్ వివరణ ఇచ్చారు. మీడియాలో తన పైన వచ్చినటువంటి కథనం గురించి ఆయన మాట్లాడుతూ.. ఎండి స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ గా మార్చి 2019లో జాయిన్ అయ్యానని.. సీమెన్స్‌ ఇష్యూ 2014 - 2017 మధ్య కాలంలో జరిగిందని... ఆ సమయంలో లో నేను ఏపీ భవన్ లో కమిషనర్ గా విధుల్లో ఉన్నానని తెలిపారు.ప్రస్తుత ప్రభుత్వంలో సిఐడి వారు వివరములు అడిగారని.. సీమెన్స్ విభాగానికి చెందిన వివరములు అన్ని క్రోడీకరించి సిఐడి వారికి అందజేయడం జరిగిందని.. ఎండి, స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ గా... 2019 మార్చికి ముందు టైంలో వ్యవహారాలపై ఎంక్వైరీ  చేసి నివేదిక ఇవ్వటం జరిగిందని ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మాజీ ఎండీ అర్జా శ్రీకాంత్ తెలిపారు.  అందులో భాగంగా వారికి కొన్ని అనుమానాలు వచ్చాయని.. ఆ అనుమానాలు క్లారిఫై చేయటానికి  160 సెక్షన్ ప్రకారము, మార్చి 9వ తేదీన విజయవాడ సిఐడి విభాగానికి వెళ్లి అవసరమైన క్లారిఫికేషన్ ఇస్తానని.. గతంలో కూడా వెళ్లి వివరణ ఇచ్చి వచ్చానని ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మాజీ ఎండీ అర్జా శ్రీకాంత్ తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: