సాధారణంగా మన నిజజీవితంలో తెలిసోతెలియకో చేసే కొన్ని పొరపాట్ల వల్ల భారీగా నష్టపోవాల్సి ఉంటుంది. అదే కోణంలో తమిళనాడులోని కోయంబత్తూరు జిల్లాలో ఓ ఘటన చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. కోయంబత్తూరు జిల్లాలోని సెంకుట్టైపాళయం ప్రాంతంలోని బోయర్ వీధికి చెందిన శాంతి గ్రేసీ అనే మహిళ తన ఇంటి ముందు కిరాణా దుకాణం నడుపుకుంటూ జీవనం కొనసాగిసున్నారు. అయితే శాంతికి ఎమిమా జాక్లిన్ అనే 19 ఏళ్ల కుమార్తె ఉంది. ఆ యువతీ డిగ్రీ చదువుతుంది.

ఇక యువతీ కాలేజీకి వెళ్లి వచ్చి ఇంట్లో పనులు కూడా చూసుకుంటూ తల్లికి చేదోడువాదోడుగా ఉంటుంది. అంతేకాదు.. తల్లి కిరాణా దుకాణం చూసుకుంటూ ఉంటే ఇంటి పని, వంట పని కూడా చేస్తుంది. ఇక సరదాగా సాగుతున్న వారి జీవితంలో అనుకోని సంఘటన చోటు చేసుకుంది. అయితే దుకాణంలో ఎలుకల బెడద ఎక్కువగా ఉండటంతో వాటిని చంపేందుకు కొన్ని క్యారెట్లలో ఎలుకల మందు కలిపి షాపులోపెట్టింది.

కాగా.. ఆ విషయం తెలియని కూతురు.. తల్లి సరుకులకు వెళ్లి వచ్చేలోపు ఇంట్లో ఉన్న క్యారెట్లతో కలిపి వంట చేసింది. అంతేకాదు.. ఆ క్యారెట్లలో ఒక క్యారెట్‌ను కూడా తిన్నది ఆ యువతీ. ఇక  తల్లి వచ్చేలోపు ఆ క్యారెట్ కూర తిన్న జాక్లిన్ ఆరోగ్యం క్షీణించి వాంతులు చేసుకోవడంతో తల్లి ఆమెను స్థానికుల ఆసుపత్రికి తరలించింది. ఇక చికిత్స తీసుకున్న తర్వాత ఆరోగ్యం మెరుగుపడటంతో ప్రాణాపాయం తప్పిందని తల్లీకూతురు ఇంటికి వచ్చారు.

అయితే మరోసారి యువతీకి విపరీతమైన కడుపు నొప్పి రావడంతో పొలాచ్చి గవర్నమెంట్ హాస్పిటల్‌కు తీసుకెళ్లగా.. ఆ తర్వాత మెరుగైన చికిత్స నిమిత్తం కోయంబత్తూరు మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్‌కు పంపించారు. యువతీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. అనంతరం వైద్యులు మృతదేహానికి పోస్టుమార్టు నిర్వహించి తల్లికి అప్పగించారు. ఇక యువతీ తండ్రి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

మరింత సమాచారం తెలుసుకోండి: