ఈ మధ్య దొంగలు పోలిసులను మాయ చేసే ప్రయత్నాలు చేస్తూ దొంగతనాలు చేస్తున్నారు. కొన్ని దొంగతనాలను పట్టుకోవడం పెద్ద చిక్కు అని చెప్పాలి. మరికొన్నిటిని ఎంతో చాక చక్యంగా పట్టుకుంటున్నారు.. తాజాగా మరో దొంగతనం జరిగింది. అయితే పోలీసులు సూపర్ బ్రైయిన్ తో వారిని త్వరగా పట్టుకున్నారు. ఇది నిజంగా పోలీసుల ను అభినందించాల్సిన విషయం. కొందరు దొంగలు ఓ గుడి లోని విగ్రహాన్ని దొంగలించారు. దానిని దాచి పెట్టేలోపు పోలీసులు పట్టుకున్నారు.

విషయానికొస్తే.. ప్రకాశం జిల్లా గిద్దలూరు లో పోలీసులు దొంగతనం కేసును కేవలం రెండు గంటల్లో నే చేధించి రికార్డు సృష్టించారు. గిద్దలూరు మండలం మిట్టమీద పల్లి గ్రామ సమీపంలోని కాశినాయన ఆలయం లో దొంగలు పడ్డారు. దొంగలు.. ఆలయంలో ఉన్న కాశీ నాయన పంచలోహల విగ్రహం తో పాటు ఆలయం బయట ఉన్న కమాండర్ జీపును దొంగలించారు. ఆలయ పూజారి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి వెంటనే చేధించారు.


పోలీసులు.. నిందితుడు తిరిగిన ప్రాంతాల లో సిసి ఫుటేజ్‌ లో ఆధారంగా ఎటువైపు వెళ్ళాడో గుర్తించారు. పోలీసులు తమను గుర్తించారన్న భయంతో నిందితుడు పెద్దారవీడు గ్రామ సమీపం లో జీపు పంచ లోహాల విగ్రహాన్ని వదిలేసి పరారయ్యారు. వేగంగా అక్కడికి చేరుకున్న సీఐ ఫిరోజ్, ఎస్ఐ బ్రహ్మనాయుడు నిందితుడు దొంగిలించి న వస్తువుల ను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం బాధితుల కు ఆ వస్తువుల ను అందజేశారు. వేగంగా దొంగ తనం కేసును చేదించి దొంగిలించిన వస్తువుల ను తిరిగి అందించిన పోలీసులకు బాధితులు ధన్యవాదాలు తెలిపారు. దొంగల కోసం సిబ్బంది విస్తృతంగా గాలిస్తున్నారని.. త్వరలోనే నిందితుల ను పట్టుకుంటామని పోలీసులు వెల్లడించారు. పోలీసులు ఇలా తక్కువ సమయం లో పట్టుకోవడం పై ప్రజలు ప్రశంసించారు..





మరింత సమాచారం తెలుసుకోండి: